పోలవరం: ఢిల్లీకి వెళ్లాలని అధికారులకు జగన్ ఆదేశం, ఎందుకంటే?

By narsimha lodeFirst Published Oct 25, 2020, 1:44 PM IST
Highlights

పోలవరం ప్రాజెక్టుపై కేంద్రాన్ని ఒప్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ విషయమై ఏపీకి చెందిన అధికారులు ఢిల్లీకి వెళ్లనున్నారు.ఈ మేరకు సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.

అమరావతి: పోలవరం ప్రాజెక్టుపై కేంద్రాన్ని ఒప్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ విషయమై ఏపీకి చెందిన అధికారులు ఢిల్లీకి వెళ్లనున్నారు.ఈ మేరకు సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.

పోలవరం ప్రాజెక్టు విషయంలో ఇరిగేషన్ శాఖ, ఆర్ధిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలను ఢిల్లీకి వెళ్లాలని సీఎం ఆదేశించారు. ఈ విషయమై కేంద్రంతో చర్చించాలని అధికారులను ఆదేశించారు. 

పోలవరం ప్రాజెక్టు విషయమై పూర్తి వివరాలతో ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాయాలని వైఎస్ జగన్ భావిస్తున్నారు. అవసరమైతే ఈ విషయమై ఢిల్లీకి కూడ వెళ్లాలని జగన్  భావిస్తున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి. 

also read:పోలవరం అంచనాల పెంపులో అవినీతి: బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ సంచలనం

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను కేంద్రం తీసుకొనేందుకు సిద్దమైతే అందుకు సానుకూలంగా ఉన్నామనే సంకేతాలు కూడ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం భావిస్తున్నట్టుగా సమాచారం.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నిధులను కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులను కూడ విడుదల చేయాలని కేంద్రాన్ని కోరింది.గత మాసంలో జగన్ ఢిల్లీ పర్యటన సమయంలో ఈ విషయమై కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్ధించారు.

 

click me!