2024 వరకు హైద్రాబాదే ఏపీ రాజధాని: బొత్స కీలక వ్యాఖ్యలు

By narsimha lode  |  First Published Mar 7, 2022, 2:52 PM IST

2024 వరకు హైద్రాబాదే ఏపీ రాజధాని అని ఏపీ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ  ప్రకటించారు. ఏపీ పునర్విభజన చట్టంలో కూడా ఇదే విషయం ఉందని ఆయన గుర్తు చేశారు. ఇవాళ ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు.



అమరావతి: 2024  వరకుHyderabad ఏపీ రాజధాని అని ఏపీ రాష్ట్ర మున్సిఫల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. సోమవారం నాడు అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత మంత్రి Botsa Satyanarayana మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారంగా హైద్రాబాద్ Andhra Pradesh  రాజధాని అని ఆయన వివరించారు. విభజన చట్టం ప్రకారంగా హైద్రాబాద్ తెలంగాణ, ఏపీకి ఉమ్మడి CapitalCity అనే విషయం స్పష్టంగా ఉందన్నారు. ఈ విషయం పార్లమెంట్, అసెంబ్లీకి, న్యాయస్థానానికి కూడా తెలుసునని మంత్రి బొత్స సత్యనారాయణ గుర్తు చేశారు.ఏపీ పునర్విభజన చట్టం పార్లమెంట్ చేసిందన్నారు.

2014లో ఏపీలో Chandra babu నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలుత హైద్రాబాద్ వేదికగానే చంద్రబాబు నాయుడు పాలన సాగించారు. అయితే Telanganaలో చోటు చేసుకొన్న ఓటుకు నోటు కేసు నేపథ్యంలో చంద్రబాబు నాయుడు Amaravathi వేదికగా పాలనను ప్రారంభించాడని అప్పట్లో విపక్షాలు విమర్శలు చేశాయి. అమరావతిలో అసెంబ్లీ, హైకోర్టు, శాసనసభ వంటి కార్యాలయాలతో పాటు శాశ్వత భవనాల ఏర్పాటుకు ప్రయత్నాలు చేశారు. 2019 లో ఎన్నికల్లో ఏపీ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఓటమి పాలయ్యాడు. YS Jagan అధికారంలోకి వచ్చాడు. ఆ తర్వాత  జగన్ సర్కార్ మూడు రాజధానుల అంశాన్ని తెరమీదికి తెచ్చింది. మూడు రాజధానులను టీడీపీ సహా అన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అమరావతి రైతులు కూడా ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.

Latest Videos

undefined

అమరావతి రైతులతో పాటు TDP సహా ఇతర పార్టీలు ఏపీ హైకోర్టులో మూడు రాజధానులను నిరసిస్తూ పిటిషన్లు దాఖలు చేశాయి.ఈ పిటిషన్లపై ఏపీ హైకోర్టు ఈ నెల 3న కీలకమైన తీర్పును వెలువరించింది. సీఆర్డీఏ చట్టం ప్రకారంగా ముందుకు వెళ్లాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. రాజధానిలో రైతులకు కేటాయించిన ప్లాట్లను కూడా అభివృద్ది చేయాలని కూడా High Court కోరింది.

జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల అంశాన్ని తెర మీదికి తీసుకొచ్చింది. అమరావతిని రాజధానిగా ఎంపిక చేయడం వెనుక చంద్రబాబుకు రహస్య ఎజెండా ఉందని వైసీపీ ఆరోపించింది. ఈ విషయమై మంత్రులతో ఏర్పాటు చేసిన కమిటీ కూడా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది.

రాష్ట్ర విభజన తర్వాత అమరావతి ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని అప్పటి టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. తాత్కాలికంగా అసెంబ్లీతో పాటూ సెక్రటేరియట్ కూడా నిర్మించారు.. హైకోర్టును కూడా ఏర్పాటు చేశారు. 2019 ఎన్నికల్లో వైసీపీ  ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి జగన్  పాలనా వికేంద్రీకరణ పేరుతో ప్రభుత్వం మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై అమరావతి రైతులు ఆందోళన బాట పట్టారు.  ఏపీ సీఆర్‌డీఏ రద్దు చట్టం, మూడు రాజధానుల చట్టాలను సవాలుచేస్తూ రాజధాని రైతులతో పాటు పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరుగుతుండగానే ఆ చట్టాలను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని కూడా తీసుకొచ్చింది. మూడు రాజధానుల చట్టాన్ని రద్దు చేసుకున్నప్పటికీ తాము దాఖలు చేసిన వ్యాజ్యాల్లో కొన్ని అభ్యర్థనలు మిగిలే ఉన్నాయని, వాటిపై విచారణ జరిపి తగిన ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ల తరఫు లాయర్లు కోర్టును కోరారు.

click me!