బీమ్లానాయక్ సినిమా టికెట్ల విషయమై ఏపీ రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ శుక్రవారం నాడు స్పందించారు. టికెట్ల రేట్లు నచ్చకపోతే సినిమాను వాయిదా వేసుకోవాలని సూచించారు
అమరావతి: సినిమా టికెట్ల ధరలు నచ్చకపోతే సినిమాను వాయిదా వేసుకోవాలని ఏపీ మంత్రి బొత్ససత్యనారాయణ సూచించారు. భీమ్లానాయక్ సినిమా టికెట్ల విషయమై ఏపీ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి Botsa Satyanarayana శుక్రవారం నాడు స్పందించారు.
Bheemla Nayak సినిమాను ప్రదర్శించే Cinema Theatre ప్రభుత్వం జారీ చేసిన G.O ప్రకారమే టికెట్లను విక్రయించాలని మెలిక పెట్టింది. దీంతో ఉద్దేశ్యపూర్వకంగానే భీమ్లా నాయక్ సినిమాపై ఏపీ ప్రభుత్వం కక్ష కట్టిందని పవన్ అభిమానులు విమర్శలు చేస్తున్నారు. ఈ తరుణంలో ఈ విషయ,మై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు.
మనం ఒక వ్యవస్థలో ఉన్నామన్నారు. వ్యవస్థ ప్రకారంగా నడుచుకోవాలని మంత్రి సూచించారు.సినిమా టికెట్ల విషయంలో చట్ట ప్రకారంగా ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు. వ్యక్తుల కోసం కాకుండా ప్రజల కోసం ఆలోచన చేయాలని మంత్రి సూచించారు.సినిమా టికెట్స్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కమిటీని వేసిన విషయాన్ని బొత్స సత్యనారాయణ గుర్తు చేశారు. ఆ అంశం ఇంకా నడుస్తుందన్నారు.
Ticket రేట్లు పెంచి విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించినట్లు తెలుస్తున్నది. గతంలో వకీల్‌సాబ్ సినిమా విడుదలకు ముందు కూడా ఇదే మాదిరిగా టికెట్ రేట్లను తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని పవన్ అభిమానులు ఆరోపిస్తున్నారు.. టికెట్ ధరల పెంపుపై ఇప్పటివరకు ఎలాంటి ఉత్తర్వులు విడుదల కాలేదు.
ఇదిలా ఉంటే భీమ్లా నాయక్ సినిమా టికెట్ ధరల విషయమై ఏపీ ప్రభుత్వం తీరును TDP చీఫ్ Chandra babu Naiduకూడా తప్పుబట్టారు. Twitter వేదికగా చంద్రబాబు ఈ విషయమై స్పందించారు. జగన్ సర్కార్ సినీ పరిశ్రమను లక్ష్యంగా చేసుకొందని ఆయన విమర్శించారు.
చివరికి వినోదాన్ని పంచే సినిమా రంగాన్ని కూడా తీవ్రంగా వేధిస్తున్నారు. భీమ్లా నాయక్ సినిమా విషయంలో జగన్ వ్యవహరిస్తున్న తీరు ప్రభుత్వ ఉగ్రవాదాన్ని తలపిస్తోంది. వ్యక్తులను టార్గెట్గా పెట్టుకుని వ్యవస్థలను నాశనం చేస్తున్న ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు.
Bharti Cement ధరలపై లేని నియంత్రణ ‘భీమ్లానాయక్’ సినిమాపై ఎందుకు? ప్రపంచ స్థాయికి వెళ్లిన తెలుగు సినిమాను తెలుగు రాష్ట్రంలో వేధిస్తున్న జగన్ తన మూర్ఖపు వైఖరి వీడాలి. రాష్ట్రంలో ఉన్న ప్రజాసమస్యలన్నీ పక్కనపెట్టి థియేటర్ దగ్గర రెవెన్యూ ఉద్యోగులను కాపలా పెట్టిన ప్రభుత్వ తీరుతో తీవ్ర అభ్యంతరకరం. ఉక్రెయిన్ లో చిక్కుకున్న తమ వారిని రక్షించుకునేందుకు దేశంలోని అన్ని రాష్ట్రాలు ప్రయత్నాలు చేస్తుంటే.. ఆంధ్రప్రదేశ్ సీఎం మాత్రం ‘భీమ్లానాయక్’పై కక్షసాధింపు చర్యల్లో బిజీగా ఉన్నారు.
తప్పులను ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తుంది.. నిలదీస్తుంది...‘భీమ్లానాయక్’ విషయంలో వేధింపులు వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నాను’ అని చంద్రబాబు అన్నారు. మరోవైపు నారా లోకేష్ సైతం థియేటర్లపై ఆంక్షలు విధించడాన్ని వ్యతిరేకిస్తూ ట్వీట్ చేశారు. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే ఆనందంగా ఉందన్నారు. ఈ సినిమా చూసేందుకు ఎదురుచూస్తున్నాను.. జగన్ ఒక్కో పరిశ్రమను ధ్వంసం చేస్తున్నారు. పరిశ్రమల ధ్వంసంతో రాష్ట్ర ప్రజలు బిక్షాటన చేసే పరిస్థితికి తెచ్చారు. సినీ పరిశ్రమ ఇందుకు మినహాయింపు కాదు. అడ్డంకులను అధిగమించి ఈ సినిమా విజయం సాధించాలని’ అని అన్నారు.