అగ్రిగోల్డ్, అక్షయగోల్డ్ కేసులో ట్విస్ట్: విచారణలు, వివాదాలన్నీ హైకోర్టు నుంచి ఏలూరు జిల్లా కోర్టుకు బదిలీ

By Siva KodatiFirst Published Feb 25, 2022, 3:19 PM IST
Highlights

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అగ్రిగోల్డ్ (agrigold scam), అక్షయగోల్డ్ (akshaya gold) కేసులలో కీలక మలుపు చోటు చేసుకుంది. అగ్రిగోల్డ్, అక్షయగోల్డ్ కేసులను ఏపీలోని ఏలూరు జిల్లా కోర్టుకు (eluru district) బదిలీ చేసింది తెలంగాణ హైకోర్టు (telangana high court) . వివాదాలను కూడా ఏలూరు  జిల్లా కోర్టుకు బదిలీ చేసింది న్యాయస్థానం.

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అగ్రిగోల్డ్ (agrigold scam), అక్షయగోల్డ్ (akshaya gold) కేసులలో కీలక మలుపు చోటు చేసుకుంది. అగ్రిగోల్డ్, అక్షయగోల్డ్ కేసులను ఏపీలోని ఏలూరు జిల్లా కోర్టుకు (eluru district) బదిలీ చేసింది తెలంగాణ హైకోర్టు (telangana high court) . వివాదాలను కూడా ఏలూరు  జిల్లా కోర్టుకు బదిలీ చేసింది న్యాయస్థానం. వేలం ద్వారా వచ్చిన రూ.50 కోట్లు కూడా ఏలూరు కోర్టుకు బదిలీ చేసింది హైకోర్టు. 

ఏడేళ్లుగా అగ్రిగోల్డ్, అక్షయగోల్డ్‌కు సంబంధించిన వివాదాలపై విచారణ జరుగుతోంది. విచారణ కొనసాగించాలన్న డిపాజిటర్లు, బ్యాంకర్ల అభ్యర్థనను తిరస్కరించింది న్యాయస్థానం. హైకోర్టు ఆదేశాలను పరిగణనలోనికి తీసుకోవాలని ఏలూరు కోర్టును ఆదేశించింది. ఏపీ డిపాజిటర్ల రక్షణ  చట్టం  ప్రకారం ఏలూరు కోర్టుకు విచారణాధికారం వుందని న్యాయస్థానం పేర్కొంది. ఈ  నేపథ్యంలో అగ్రిగోల్డ్, అక్షయ గోల్డ్‌కు సంబంధించిన కేసులన్నింటిపైనా విచారణ ముగించింది. 

అంతకుముందు 2020, డిసెంబర్ 24న అగ్రిగోల్డ్ కు చెందిన రూ. 4,109 విలువైన ఆస్తులను ఈడీ తాత్కాలికంగా జప్తు చేసిన సంగతి తెలిసిందే. ఏపీ, తెలంగాణ, కర్ణాటక , ఒడిశాలలోని అగ్రిగోల్డ్ ఆస్తులను స్వాధీనం చేసుకొంది. ఏపీ రాష్ట్రంలో 56 ఎకరాల హాయ్ లాండ్ ఆస్తులు, పలు కంపెనీల్లో వాటాలు, యంత్రాలను ఈడీ అటాచ్ చేసింది. అగ్రిగోల్డ్ లో డిపాజిట్లు చేసిన వారికి కోర్టు ఆదేశాల మేరకు విడతల వారీగా డబ్బులు చెల్లించారు. అగ్రిగోల్డ్  స్కామ్ లో ఈడీ దర్యాప్తును ముమ్మరం చేసింది.160 షెల్ కంపెనీలతో మనీలాండరింగ్ కు పాల్పడినట్టుగా అగ్రిగోల్డ్ సంస్థ ఛైర్మెన్, డైరెక్టర్లపై ఆరోపణలున్నాయి.  

ఆరు రాష్ట్రాల్లోని 32 లక్షలమంది పెట్టుబడిదారుల నుండి 36,380 కోట్ల కుంభకోణానికి అగ్రిగోల్డ్ లో చోటు చేసుకొందని దర్యాప్తు సంస్థలు తేల్చాయి. ఏపీ రాష్ట్రంలోని అనంతపురం, కర్నూల్, కృష్ణ, గుంటూరు, చిత్తూరు, కడప, విజయనగరం, తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి, విశాఖపట్టణం, నెల్లూరు. ప్రకాశం, శ్రీకాకుళం, కడప జిల్లాల్లోని అగ్రిగోల్డ్ ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ఇక కర్ణాటకలోని యాదగిర్, బెంగుళూరు, కోలార్, మాండ్యా జిల్లాల్లోని ఆస్తులను అటాచ్ చేసింది. ఒడిశాలోని ఖుర్ధా, తమిళనాడులోని కృష్ణగిరి, తెలంగాణలోని మహబూబ్ నగర్, నారాయణపేట, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల్లోని ఆస్తులను ఈడీ జప్తు చేసింది.

click me!