భారతీ సిమెంట్ ధరపై నియంత్రణ లేదు కానీ.. ‘భీమ్లానాయక్’ పై ఎందుకు..? మండిపడ్డ చంద్రబాబు

Published : Feb 25, 2022, 02:04 PM IST
భారతీ సిమెంట్ ధరపై నియంత్రణ లేదు కానీ.. ‘భీమ్లానాయక్’ పై ఎందుకు..? మండిపడ్డ చంద్రబాబు

సారాంశం

భారతీ సిమెంట్ ధరపై లేని నియంత్రణ ‘భీమ్లానాయక్’ సినిమా టికెట్లపై ఎందుకంటూ... జగన్ కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విరుచుకుపడ్డారు. 

హైదరాబాద్ : సినిమా పరిశ్రమపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై టీడీపీ అధినేత chandrababu naidu తప్పుపట్టారు. ‘Bheemla Nayak’ సినిమా విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం చంద్రబాబు వరుస ట్వీట్లు పెట్టారు. రాష్ట్రంలో ఏ వ్యవస్థను ముఖ్యమంత్రి YS Jagan వదలడంలేదు.. చివరికి వినోదాన్ని పంచే సినిమా రంగాన్ని కూడా తీవ్రంగా వేధిస్తున్నారు. భీమ్లా నాయక్ సినిమా విషయంలో జగన్ వ్యవహరిస్తున్న తీరు ప్రభుత్వ ఉగ్రవాదాన్ని తలపిస్తోంది.  వ్యక్తులను టార్గెట్గా పెట్టుకుని వ్యవస్థలను నాశనం చేస్తున్న ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. 

Bharti Cement ధరలపై లేని నియంత్రణ ‘భీమ్లానాయక్’ సినిమాపై ఎందుకు? ప్రపంచ స్థాయికి వెళ్లిన తెలుగు సినిమాను తెలుగు రాష్ట్రంలో వేధిస్తున్న జగన్ తన మూర్ఖపు వైఖరి వీడాలి. రాష్ట్రంలో ఉన్న ప్రజాసమస్యలన్నీ పక్కనపెట్టి  థియేటర్ దగ్గర రెవెన్యూ ఉద్యోగులను కాపలా పెట్టిన ప్రభుత్వ తీరుతో తీవ్ర అభ్యంతరకరం. ఉక్రెయిన్ లో చిక్కుకున్న తమ వారిని రక్షించుకునేందుకు దేశంలోని అన్ని రాష్ట్రాలు ప్రయత్నాలు చేస్తుంటే.. ఆంధ్రప్రదేశ్ సీఎం మాత్రం ‘భీమ్లానాయక్’పై కక్షసాధింపు చర్యల్లో బిజీగా ఉన్నారు.

తప్పులను ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తుంది.. నిలదీస్తుంది...‘భీమ్లానాయక్’ విషయంలో వేధింపులు వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నాను’ అని చంద్రబాబు అన్నారు. మరోవైపు  నారా లోకేష్ సైతం థియేటర్లపై ఆంక్షలు విధించడాన్ని వ్యతిరేకిస్తూ ట్వీట్ చేశారు. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే ఆనందంగా ఉందన్నారు. ఈ సినిమా చూసేందుకు ఎదురుచూస్తున్నాను.. జగన్ ఒక్కో పరిశ్రమను ధ్వంసం చేస్తున్నారు. పరిశ్రమల ధ్వంసంతో రాష్ట్ర ప్రజలు బిక్షాటన చేసే పరిస్థితికి తెచ్చారు. సినీ పరిశ్రమ ఇందుకు మినహాయింపు కాదు. అడ్డంకులను అధిగమించి ఈ సినిమా విజయం సాధించాలని’ అని అన్నారు. 

ఇదిలా ఉండగా, Bheemla Nayak సినిమా విడుదల నేపథ్యంలో Movie ticket rates వివాదం ఏపీలో అగ్గిపెడుతోంది. Pawan Kalyan మీద కక్ష సాధింపు గానే జగన్ వ్యవహరిస్తున్నాడని ఏపీ బీజేపీ నేతలు మండిపడుతున్నారు. Benefit showలను అడ్డుకోవడం, టికెట్ రేట్లను తగ్గించడం ఇప్పుడు మరింత ముదురుతోంది.ఏపీలో నెలకొన్న వివాదం మీద మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు సినిమా ప్రముఖులతో కలిసి ఏపీ సీఎం జగన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. సినిమా పరిశ్రమపై శీతకన్ను వేయద్దంటూ.. జగన్ ను బతిమిలాడారు.

దీనిమీద జగన్ సానుకూలంగా స్పందించినా.. ఇంకా టికెట్ రేట్ల విషయం, బెనిఫిట్ షోల మీద ఇదమిద్ధంగా ఎలాంటి నిర్ణయమూ బైటికి రాలేదు. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ నేడు రిలీజవ్వడంతో.. జగన్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా కక్ష సాధింపు చేస్తున్నాడనే వాదనలు వినిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలోనే బీజేపీ నేత Lanka Dinkar జగన్ ను ఉద్దేశించి చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ‘పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ ను రాష్ట్రంలో అడ్డుకోవాలని విశ్వప్రయత్నం చేస్తున్న ‘జూమ్లా నాయక్’ జగన్. ఈ ప్రభుత్వం మద్యం కొట్టు, చికెన్ కొట్టు, మటన్ కొట్టు, చేపలకొట్టుతో మొదలుపెట్టి.. ‘సినిమా టిక్కెట్ల’ వరకు వచ్చారు అంటూ ఎద్దేవా చేశారు.

అంతేకాదు.. ‘రెవెన్యూ అధికారుల విలువైన సమయం థియేటర్ల బాత్రూంలకి అంకితం చేసిన ఘటన సీఎం జగన్ సాధించారని’ వ్యంగ్యాస్తాలు వదిలారు. అంతేకాదు.. సినిమా పెద్దలకు బడ్జెట్ ను బట్టి టికెట్ ధరల నిర్ణయం జీఓ ఇస్తామని ‘జూటాహామీ’ ఇచ్చారా? అని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ సినిమా భీమ్లా నాయక్ కోసం ఇంత ప్రహసనం అవసరమా? పాలకుడు అంటే అందరినీ సమానంగా చూడాలి. నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి కమిట్మెంట్ ఉంటే టీటీడీ భారీగా పెంచిన స్వామివారి సేవల టిక్కెట్ల ధరలు తగ్గించాలి.. అంటూ డిమాండ్ చేశారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?