యువతి ఆరోపణల ఎఫెక్ట్: గుంటూరు డిఎఫ్ఓ మోహన్ రావు బదిలీ

Published : Jul 04, 2019, 02:52 PM IST
యువతి ఆరోపణల ఎఫెక్ట్:   గుంటూరు డిఎఫ్ఓ మోహన్ రావు బదిలీ

సారాంశం

గుంటూరు డిఎఫ్ఓ మోహన్‌రావుపై బదిలీ వేటు పడింది. ఆయనపై  వచ్చిన ఆరోపణలపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి  ఆదేశించారు.  

గుంటూరు:గుంటూరు డిఎఫ్ఓ మోహన్‌రావుపై బదిలీ వేటు పడింది. ఆయనపై  వచ్చిన ఆరోపణలపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి  ఆదేశించారు.

గుంటూరు డిఎఫ్ఓ మోహన్ రావుపై ఓ యువతి ఆరోపణలు చేసింది. తనకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మోహన్ రావు రూ. 2 లక్షలు తీసుకొన్నాడని  బాధితురాలు ఆరోపించింది.

అంతేకాదు తనపై డిఎఫ్ఓ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని  కూడ ఆరోపణలు చేసింది. ఈ విషయమై గురువారం నాడు మంత్రి స్పందించారు.మోహన్ రావును బదిలీ చేయాలని  మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు.  ఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. 

ఈ విషయమై బాధితురాలు ఏపీ డిప్యూటీ సీఎం  సుచరితకు ఫిర్యాదు చేసింది. ఈ ఆరోపణలను డిఎఫ్ఓ మోహన్ రావు తీవ్రంగా ఖండించారు. తనపై ఆ యువతి ఎందుకు ఈ ఆరోపణలు చేశారో తనకు తెలియదన్నారు. 

సంబంధిత వార్తలు

డిఎఫ్ఓ లైంగిక దాడి చేశాడు: సుచరితకు యువతి ఫిర్యాదు

 

PREV
click me!

Recommended Stories

Nimmala Ramanaidu: ఈ రిజర్వాయర్ల భూ సేకరణలో జగన్ రైతులకు ఏం చేశారో తెలుసా? | Asianet News Telugu
టీడీపీ బతుకంతా కాపీ పేస్టే.. Gudivada Amarnath Comments on Bhogapuram Airport | Asianet News Telugu