మరుగుదొడ్లను కూడా వదిలిపెట్టలేదు...విజయసాయి

Published : Jul 04, 2019, 02:46 PM IST
మరుగుదొడ్లను కూడా వదిలిపెట్టలేదు...విజయసాయి

సారాంశం

ఏపీలో ఎన్నికల ఫలితాల అనంతరం అధికార-ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఒకరిని మరొకరు సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేసుకుంటున్నారు.

ఏపీలో ఎన్నికల ఫలితాల అనంతరం అధికార-ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఒకరిని మరొకరు సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా... వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేశారు. చంద్రబాబు హయంలో కనీసం మరుగుదొడ్లను కూడా వదిలిపెట్టలేదని ఆరోపించారు.

‘‘పేద కుటుంబాలకు మరుగు దొడ్ల నిర్మాణం కోసం కేటాయించిన నిధులను మీ పార్టీ నేతలు మింగేశారు. మీ నివాసం, మంత్రుల ఇళ్లలో ఒక్కో టాయిలెట్ రెనోవేషన్ పనులకు 7 నుంచి 9 లక్షలు ఖర్చు చేసినట్టు బిల్లులు సృష్టించారు. చివరకు దొడ్లను కూడా వదిలి పెట్టలేదు కదా చంద్రబాబు గారూ?’’ అంటూ విజయసాయి ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం .. ఈ ప్రాంతాల్లో చల్లని వర్షాలు
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?