పవన్‌కు అలా అలవాటే.. ఒక్కో ఎన్నికకు ఒక్కొక్కరితో.. పొత్తులపై మంత్రి బాలినేని విసుర్లు

Published : Mar 18, 2022, 02:22 PM IST
పవన్‌కు అలా అలవాటే.. ఒక్కో ఎన్నికకు ఒక్కొక్కరితో.. పొత్తులపై మంత్రి బాలినేని విసుర్లు

సారాంశం

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పవన్ కళ్యాణ్ ఒక్కో ఎన్నికకు ఒక్కో పార్టీతో పొత్తు పెట్టుకుంటారని, అది ఆయనకు అలవాటేనని చెప్పారు. మొన్నటి వరకు టీడీపీని తిట్టినా ఆయనే ఆ పార్టీతో పొత్తుకు సిద్ధం కావడమేంటని ప్రశ్నించారు.  

అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్‌ ఒక్కో ఎన్నికకు ఒక్కో పార్టీతో పొత్తు పెట్టుకుంటారని విమర్శించారు. ఒక్కో ఎన్నికకు ఒక్కొక్కరిని తిడతారని, మళ్లీ వారితో  పొత్తుకు సై అంటాడని అన్నారు. మొన్నటి ఎన్నికల్లో టీడీపీని తిట్టిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మళ్లీ చంద్రబాబుతో పొత్తుకు సిద్ధం అవుతున్నారని తెలిపారు. ఒక్కో ఎన్నికలకు ఒక్కొక్కరితో పొత్తుపెట్టుకోవడం పవన్ కళ్యాణ్‌కు అలవాటే అని ఎద్దేవా చేశారు.

చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రి చేయడానికి పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకోవడమేమిటో అంటూ వ్యంగ్యం విసిరారు. పవన్ కళ్యాణ్ ముందుగా కొన్ని విషయాల్లో స్పష్టతకు రావాలని సూచనలు చేశారు. ముందు తానే సీఎం క్యాండిడేట్ అని ప్రకటించుకుని పొత్తుల గురించి మాట్లాడాలని వివరించారు. అలాంటిదేమీ లేకుండా.. అధికారంలోకి వస్తే.. ఇది చేస్తాం అది చేస్తాం అని బుకాయించడం మానుకోవాలని తెలిపారు. తాను సీఎంగా లేకుండా ఇతర పార్టీలకు మద్దతుతో ఒక వేళ అధికారంలోకి వచ్చినా.. ఆయన చేసేది ఏముంటుందని అడిగారు. 

పవన్ కళ్యాణ్ తనకు సీఎం పదవిని డిమాండ్ చేసి.. ఇతర పార్టీతో పొత్తు పెట్టుకుంటే దానికి ఒక అర్థం ఉంటుందని, కానీ, చంద్రబాబును సీఎం చేయడానికి పవన్ కళ్యాణ్ పొత్తు ప్రతిపాదన తెర మీదకు తీసుకురావడం ఎలా ఉందో ఒక సారి ఆలోచించాలని వివరించారు.

ఇదే సమయంలో జనసేన 8వ ఆవిర్భావ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని మాటలను మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రస్తావించారు. పవన్ కళ్యాణ్ సొంత పార్టీ పెట్టుకుని వేరే పార్టీని రోడ్డు మ్యాప్ అడగడం ఏంటని ప్రశ్నించారు. ఎవరో సీఎం అయితే.. పవన్ కళ్యాణ్ ఎలా హమీల వరాలు ప్రకటిస్తారని, ఒక వేళ అధికారంలోకి వచ్చినా ఆయన ఎలా వాటిని అమలు చేస్తారని అడిగారు.

ఇటీవలే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీపై కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనిచ్చేది లేదని జనసేన 8వ ఆవిర్భవ సభలో తెలిపారు. కాబట్టి, తాము అన్ని శక్తులు కలిసి వెళ్తాయని చెప్పారు. అయితే, భవిష్యత్‌ పోరాటానికి సంబంధించి బీజేపీ తమకు రోడ్ మ్యాప్ అందించాలని కోరారు. బీజేపీ రోడ్ మ్యాప్ అందిస్తే.. అమలు చేయడమే ఆలస్యం అన్నట్టుగా పేర్కొన్నారు. తన వ్యాఖ్యల్లో ఆయన బీజేపీతోపాటు టీడీపీనీ కలుపుకోవాలనే ఉద్దేశ్యం ధ్వనించింది.

ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు నిన్న కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ భవిష్యత్ ప్రణాళికలను సూత్రప్రాయంగా వెల్లడించారు. ఇటీవలే పవన్ కళ్యాణ్ జనసేన 8వ ఆవిర్భావ సభలో చేసిన విజ్ఞప్తికీ సమాధానాన్నీ ఇచ్చినట్టుగా తెలుస్తున్నది. ఈ రోజు ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ఏపీలో దిశ, దశ లేని ప్రభుత్వం పాలన చేస్తున్నదని మండిపడ్డారు. వాలంటరీ వ్యవస్థతో ప్రజాస్వామ్యాన్ని నాశనం చేశారని వైసీపీపై ఫైర్ అయ్యారు. అంతేకాదు, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలంటే బీజేపీ, జనసేన కూటమి ఏకైక ప్రత్యామ్నాయం అని స్పష్టం చేశారు. భవిష్యత్‌లో ఎవరు అధికారంలోకి వస్తారో ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. అదే సందర్భంలో ఇతర విషయాలు చెబుతూ.. సర్పంచులకు నిధులుకు కేంద్రం నుం

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్