లండన్‌కు జగన్...వైఎస్సార్‌సిపి ఇంచార్జీగా కేటీఆర్‌కు బాధ్యతలు : అచ్చెన్నాయుడి సెటైర్

By Arun Kumar PFirst Published Feb 24, 2019, 4:05 PM IST
Highlights

టిడిపి అధినేత చంద్రబాబుపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన విమర్శలపై ఏపి మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు. కేటీఆర్ వైఎస్సార్‌సిపి ఇంచార్జీ మాదిరిగా వ్యవహరిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. జగన్ విదేశీ పర్యటనకు వెళుతూ పార్టీ బాధ్యతలు కేటీఆర్ కు అప్పగించారా? అంటూ ప్రశ్నించారు. లేకపోతే కేటీఆర్ కు చంద్రబాబును విమర్శించాల్సిన అవసరం ఏముంటుందని అన్నారు. వంద మంది కేటీఆర్,జగన్ లు వచ్చినా చంద్రబాబు విజయాన్ని అడ్డుకోలేరని అచ్చెన్నాయుడు అన్నారు.

తెలుగు దేశం నాయకులను వైఎస్సార్‌సిపి లో చేరేలా టీఆర్ఎస్ పార్టీ ప్రలోబాలకు గురిచేస్తోందని ఆరోపించారు. ఇటీవల హైదరాబాద్ వేదికగా జరిగిన పిరాయింపు చర్చలే అందుకు నిదర్శనమన్నారు. వైఎస్సార్‌సిపి-టీఅర్ఎస్ లు కలిసి కేంద్రం సాయంతో ఏపిలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించడానికి కుట్రలు పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. 

కేటీఆర్ ముందు తెలంగాణ రాష్ట్ర పాలనపై దృష్టి సారించాలని అచ్చెన్నాయుడు సూచించారు. మిగులు ఆదాయం కలిగిన రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారం చేపట్టికూడా 40శాతం హామీలను కూడా అమలు చేయలేదన్నారు. కానీ లోటే బడ్జెట్ తో ఏర్పడిన ఏపిలో టిడిపి అధికారం చేపట్టి 100శాతం హామీలను నెరవేర్చిందని స్పష్టం చేశారు. గత ఐదేళ్లలో రెండు రాష్ట్రాల్లో జరిగిన అభివృద్దిపై బహిరంగ చర్చకు సిద్దమా? అంటూ కేటీఆర్ కు అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు.  
  
click me!