ఆ ఇద్దరి వల్ల కాదు, కొత్త నాయకుడ్ని వెతుక్కోండి: టీడీపీకి మంత్రి అనిల్ సలహా

Published : Jul 02, 2019, 07:21 PM ISTUpdated : Jul 02, 2019, 07:22 PM IST
ఆ ఇద్దరి వల్ల కాదు, కొత్త నాయకుడ్ని వెతుక్కోండి: టీడీపీకి  మంత్రి అనిల్ సలహా

సారాంశం

టీడీపీ అధినేత చంద్రబాబు ముసలివారు అయ్యారని, మరొకరు పులకేసిలా మారారని అంటూ లోకేష్ పై పరోక్షంగా విమర్శించారు. తెలుగుదేశం పార్టీకి నూతన నాయకుడు అవసరం వచ్చిందన్నారు. అందువల్లే టీడీపీలో తర్వాత నాయకుడు ఎవరు అని ఆ పార్టీ నేతలు వెతుకుతున్నారని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు.


అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్. లోకేష్ బయటకొచ్చి మాట్లాడితే తప్పులొస్తాయని భావించి ట్వీట్ లు చేస్తున్నారని విరుచుకుపడ్డారు. 

అసలు ఆ ట్వీట్‌లను లోకేష్ చేస్తున్నారో.. ఎవరైనా రాస్తున్నారో అని సందేహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీలో నాయకత్వ లోపం ఉందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ముసలివారు అయ్యారని, మరొకరు పులకేసిలా మారారని అంటూ లోకేష్ పై పరోక్షంగా విమర్శించారు. 

తెలుగుదేశం పార్టీకి నూతన నాయకుడు అవసరం వచ్చిందన్నారు. అందువల్లే టీడీపీలో తర్వాత నాయకుడు ఎవరు అని ఆ పార్టీ నేతలు వెతుకుతున్నారని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. 

ఈ వార్తలు కూడా చదవండి

తప్పులు దొర్లుతాయనే లోకేష్ ట్వీట్లు, ట్వీట్లు ఆయనే పోస్ట్ చేస్తున్నాడా ..: మంత్రి అనిల్ సందేహం

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Naidu: కాకినాడలో ఏఎమ్ గ్రీన్ అమ్మోనియా పరిశ్రమకు శంకుస్థాపన చేసిన సీఎం | Asianet
CM Chandrababu Naidu: కాకినాడలో ఏఎమ్ గ్రీన్ అమ్మోనియాచంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్| Asianet News Telugu