ఓవర్ యాక్షన్ కు బ్రాండ్ అంబాసిడర్ జగన్: బుద్ధా వెంకన్న

Published : Jul 02, 2019, 05:58 PM IST
ఓవర్ యాక్షన్ కు బ్రాండ్ అంబాసిడర్ జగన్: బుద్ధా వెంకన్న

సారాంశం

నాన్నారు కోసం చనిపోయారంటూ చాంతాడంత లిస్ట్ మీ సలహాతో విడుదల చేశారని ఆరోపించారు. ఓదార్పు సహాయం కొంత మందికే ఇచ్చి 2014 ఓటమి తరువాత మిగిలిన వాళ్లకి ఎందుకు ఎగ్గొట్టారు? వాళ్ళు నాన్నారు కోసం చనిపోయినవారు కాదా? అంటూ ట్విట్టర్ వేదికగా నిలదీశారు.  

అమరావతి: ఆంధ్రప్రదేశ్ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. ఓదార్పు పేరుతో ఓవర్ యాక్షన్ కి బ్రాండ్ అంబాసిడర్ మీ మహామేత తనయుడు జూనియర్ మేత అంటూ జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

నాన్నారు కోసం చనిపోయారంటూ చాంతాడంత లిస్ట్ మీ సలహాతో విడుదల చేశారని ఆరోపించారు. ఓదార్పు సహాయం కొంత మందికే ఇచ్చి 2014 ఓటమి తరువాత మిగిలిన వాళ్లకి ఎందుకు ఎగ్గొట్టారు? వాళ్ళు నాన్నారు కోసం చనిపోయినవారు కాదా? అంటూ ట్విట్టర్ వేదికగా నిలదీశారు.

అంతేకాదు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డిని అక్రమసాయిరెడ్డి అంటూ సంబోధిస్తూ కీలక పోస్టు చేశారు బుద్ధా వెంకన్న. అక్రమ సాయి రెడ్డి పెయిడ్ ఆర్టిస్ట్ కి పర్యాయపదం అయిన మీరు, రాజధాని రైతులని పెయిడ్ ఆర్టిస్టులు అని అవమానపరిచినందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

అంతేకాదు దొంగలేక్కలు రాయడంలో విజయసాయిరెడ్డి సిద్ధహస్తులు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అవకాశం దొరకాలే కానీ మీరు ఎక్కడైనా దొంగలెక్కలు రాయగల సిద్ధహస్తులు అంటూ విరుచుకుపడ్డారు. 

అందుకే కదా 16 నెలల కృష్ణాజన్మస్థాన ప్రాప్తి అయ్యిందంటూ ఎద్దేవా చేశారు. ప్రజలను కిన్లే వాటర్ బాటిల్ తో ఏమార్చి, దొడ్డిదారిన జీవోలతో ప్రజాధనాన్ని బొక్కడమే కదా మీ ప్రత్యేకత అంటూ బుద్ధా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

PREV
click me!

Recommended Stories

Nimmala Ramanaidu: ఈ రిజర్వాయర్ల భూ సేకరణలో జగన్ రైతులకు ఏం చేశారో తెలుసా? | Asianet News Telugu
టీడీపీ బతుకంతా కాపీ పేస్టే.. Gudivada Amarnath Comments on Bhogapuram Airport | Asianet News Telugu