పోలవరం నిర్మాణ పనులపై మంత్రి అనిల్ కుమార్ సమీక్ష

By Siva KodatiFirst Published May 6, 2020, 5:38 PM IST
Highlights

పోలవరం నిర్మాణ పనులపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సమీక్ష నిర్వహించారు. మే 2020 నాటికి 6,115 ఇళ్లు, జూన్ నాటికి 4,056 ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా జూలైలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అనిల్ కుమార్ చెప్పారు

పోలవరం నిర్మాణ పనులపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సమీక్ష నిర్వహించారు. మే 2020 నాటికి 6,115 ఇళ్లు, జూన్ నాటికి 4,056 ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా జూలైలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అనిల్ కుమార్ చెప్పారు.

 

 

స్పిల్‌ వే పనులు జూలై 15 నాటికి పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. స్పిల్ ఛానల్ తవ్వకం, కాంక్రీట్ పనులు జూలై 15 నాటికి పూర్తి చేయాలని అలాగే ఇందుకు సంబంధించిన యంత్ర సామాగ్రి, శ్రామికులను తరలించేందకు నిర్మాణ సంస్థ సైతం అంగీకరించింది. అలాగే వరద సమయంలో చేయవలసిన పనులపైనా అనిల్ కుమార్ అధికారులకు పలు సూచనలు చేశారు. 

 

* ఈ సి ఆర్ ఎఫ్ డ్యాం గ్యాప్ నందు పనులు పూర్తి చేయుట
* స్పిల్ వే బ్రిడ్జి నిర్మాణం 15 నవంబర్ నాటికి పనులు పూర్తి చేయాలి
* కాంక్రీట్ డ్యాం గ్యాప్ నందు పనులు నవంబర్‌ ఒకటో తేదీ 2020 నుంచి మొదలుపెట్టి ఫిబ్రవరి 2021 నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు. 
* ఫిబ్రవరి 2021 నుంచి గోదావరి డెల్టా రెండవ పంటకు అవసరమైన నీటిని ఫీల్ రివర్ సుయిజ్‌ల ద్వారా తరలించుటకు నిర్ణయించారు.
* ఎగువ కాపర్ డ్యాం రీచ్‌ 3 పనులు జనవరి 2021 నుంచి మొదలు పెట్టాలని నిర్ణయించారు. 

click me!