నువ్వు పెట్టిన నిమ్మగడ్డ అలా అంటే నువ్వు ఇలానా: చంద్రబాబుపై అనిల్

By telugu teamFirst Published Feb 22, 2021, 5:50 PM IST
Highlights

టీడీపీ చీఫ్ చంద్రబాబుపై ఏపీ మంత్రి అనిల్ కుమార్ విరుచుకుపడ్డారు. ఓడిపోయిన పార్టీ సంబరాలు చేసుకోవడం దేశ చరిత్రలో చంద్రబాబు పార్టీ ఒక్కటేనని అనిల్ వ్యాఖ్యానించారు.

అమరావతి: భారతదేశ చరిత్రలో ఓడిపోతే సంబరాలు చేసుకుంది చంద్రబాబు పార్టీ ఒక్కటి మాత్రమేనని మంత్రి అనిల్ కుమార్ అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 81 శాతం స్థానాలను వైఎస్సార్ కాంగ్రెస్ సాధిస్తే 16 శాతం సాధించి సంబరాలు చేసుకోవడమేమిటని ఆయన అడిగారు. ప్రతి విడతలో టీడీపీ పుంజుకుందని చంద్రబాబు చెప్పడం విడ్డూరమని ఆయన అన్నారు. 

ఏపీ ముఖ్యమంత్రి జగన్ సాగిస్తున్న సంక్షేమ పాలన వల్ల రెట్టింపు ఉత్సాహంతో ప్రజలు విజయాన్ని అందించారని ఆయన సోమవారం మీడియా సమావేశంలో అన్నారు. టీడీపీకి వచ్చిన 16 శాతం సీట్లు కూడా వైసీపీ తిరుగుబాటు అభ్యర్థుల వల్ల వచ్చినవేనని, లేదంటే టీడీపీ సింగిల్ డిజిట్ కు పరిమితమయ్యేదని ఆయన అన్ారు. 

టీడీపీ 41 శాతం సీట్లు వచ్చాయని చంద్రబాబు చెప్పడం అభూత కల్పన మాత్రమేనని ఆయన అన్నారు. దమ్ముంటే ఏ జిల్లాలోనైనా టీడీపీ వాళ్లకు కండువా వేసి చంద్రబాబు చూపించాలని ఆయన సవాల్ విసిరారు.  చంద్రగిరిలో 104 స్థానాలు వైసీపి గెలిస్తే నాలుగు టీడీపీ గెలిచిందని ఆయన చెప్పారు.

నారావారిపల్లెలో 8 వార్డులు గెలిచి సంబరాలు చేసుకున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు సొంత ఇలాకాలోనే 20 శాతం సాధించలేని టీడీపీ 41 శాతం ఎలా గెలిచిందని ఆయన అడిగారు. సర్పంచ్ ఎన్నికలకు 25 మీడియా సమావేశాలు పెట్టిన ఘనుడు చంద్రబాబు అని ఆయన అన్నారు. ఓ పక్క చంద్రబాబు పెట్టిన నిమ్మగడ్డ అంతా బాగా జరిగిదని అంటే చంద్రబాబు రావణకాష్టం అంటున్నారని ఆయన అన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగాయని ఆయన అన్నారు. 

కుప్పంలోనే చంద్రబాబుకు దిక్కులేదని, మరో 10 శాతం అదనంగా వచ్చేవని చెప్పడానికి చంద్రబాబుకు సిగ్గు లేనది ఆయన అన్నారు. వైసీపీ పతనమైంది ఎక్కడో చూపించాలని ఆయన చంద్రబాబును సవాల్ చేశారు. టీడీపీ అంపశయ్యపై నుంచి చితిలో పడిపోయిందని మంత్రి వ్యాఖ్యానించారు. ఏ దిక్కు లేక స్వరూపానందపై చంద్రబాబు పడ్డాడని, క్షుద్రపూజలు అంటున్నారని ఆయన అన్నారు. 

క్షుద్రపూజల పేటెంట్ ఒక్క చంద్రబాబుకే ఉందని మంత్రి అనిల్అన్నారు. దుర్గగుడి, కాళహస్తి కొడుకు కోసం చంద్రబాబు క్షుద్రపూజలు చేయించారని ఆయన ఆరోపించారు. కాపిటల్ జోన్ అంటున్న తాటికొండలో కూడా 70 శాతం సీట్లు వైసీపీయే గెలుచుకుందని ఆయన చెప్పారు. ప్రజలు 81 శాతం సీట్లు వైసీపీకి కట్టబెట్టి జనగ్ మీద నమ్మకాన్ని ఉంచారని ఆయన చెప్పారు. బూతుల్లో గెలిచి సంబరాలు చేసుకునే స్థాయికి టీడీపీ దిగజారుతుందని ఆయన అన్నారు.

ప్రతిపక్ష పాత్రకు కూడా చంద్రబాబు పనికి రాడని ప్రజలు తీర్పు చెప్పారని ఆయన అన్నారు. అధికారంలో ఉండడానికి వైసీపీకి అర్హత లేదనే అర్హత చంద్రబాబు అసలే లేదని ఆయన అన్నారు. ఆడలేక మద్దెల దరువు అన్నట్లు చంద్రబాబు తీరు ఉందని ఆయన అన్నారు.  

click me!