నీలం సహానీ, ద్వివేదిలకు షాక్: కోర్టుకు హాజరుకావాలని ఏపీ హైకోర్టు ఆదేశం

By narsimha lode  |  First Published Feb 22, 2021, 5:20 PM IST

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ కేసులో ఏపీ హైకోర్టు సోమవారం నాడు కీలక ఆదేశాలు జారీ చేసింది.
 


అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ కేసులో ఏపీ హైకోర్టు సోమవారం నాడు కీలక ఆదేశాలు జారీ చేసింది.

ఈ ఏడాది మార్చి 22వ తేదీన  కోర్టు ముందు హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది.  ప్రభుత్వం సహకరించడం లేదని గతంలో ఎస్ఈసీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై ఏపీ హైకోర్టు సోమవారం నాడు విచారణ జరిపింది.

Latest Videos

మాజీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ,  పంచాయితీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేదిలను కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది హైకోర్టు.

నీలం సహానీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సమయంలో కూడ కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు ముందు హాజరయ్యారు. కోర్టు ఆదేశాలను ధిక్కరించడంతో కోర్టు ముందు హాజరుకావాలని కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తమకు సహకరించడం లేదని రాష్ట్ర ఎన్నికల సంఘం గతంలో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది.ఈ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 

 


 

click me!