విశాఖపట్నంలో 150 మంది కవలల సందడి

Published : Feb 22, 2021, 05:26 PM IST
విశాఖపట్నంలో 150 మంది కవలల సందడి

సారాంశం

అంతర్జాతీయ కవలల దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో దాదాపు 150 మంది కవలలు సందడి చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విజేతలకు బహురమతి ప్రదానం జరిగింది.

విశాఖపట్నం: అంతర్జాతీయ కవలల దినోత్సవం పురస్కరించుకొని విశాఖపట్నంలోని రాక్ డెల్ హోటల్ లో సుమారు 150 మంది కవలలు ఆహుతులను అలరించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకుడు రాంజీ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తమ సంస్థ తరపున ఈ దినోత్సవాన్ని నిర్వహించి వారిలో ఆత్మస్థైర్యం, నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.  

మానవుల అందరిలోనూ కలలో ప్రేమాభిమానాలు మెండుగా ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల నుంచి కవలలు హాజరయ్యారని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా కవలలకు వివిధ పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు. 

అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. కార్యక్రమానికి పాల్గొన్న కవులలో సంతోషాలు కనిపించాయి. కార్యక్రమంలో కవలల తల్లిదండ్రులు, కార్యక్రమ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

PREV
click me!

Recommended Stories

CM Chandrababu: జిల్లా కలెక్టర్లే ప్రభుత్వానికిబ్రాండ్ అంబాసిడర్లు: బాబు | Asianet News Telugu
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే