రాజధానులపై ప్రభుత్వాలకే నిర్ణయం: సుప్రీం తీర్పుపై మంత్రి అంబటి

By narsimha lode  |  First Published Nov 28, 2022, 4:58 PM IST

సుప్రీంకోర్టు  వ్యాఖ్యలతోనైనా  విపక్షాలు  కళ్లు తెరవాలని  ఏపీ మంత్రి  అంబటి రాంబాబు  సూచించారు.రాజధాని  విషయంలో ప్రభుత్వాలదే  నిర్ణయమని  సుప్రీంకోర్టు  వ్యాఖ్యలు తేటతెల్లం  చేశాయన్నారు.


అమరావతి: రాజధానుల  విషయంలో హైకోర్టు  జోక్యం  సరికాదని సుప్రీంకోర్టు  వ్యాఖ్యల  ద్వారా  తెలుస్తుందని  ఏపీ  మంత్రి  అంబటి రాంబాబు  చెప్పారు. ఏపీ రాష్ట్ర  మంత్రి అంబటి రాంబాబు  సోమవారంనాడు  అమరావతిలో  మీడియాతో  మాట్లాడారు.  అమరావతిపై ఏపీ హైకోర్టు  ఇచ్చిన  తీర్పుపై  సుప్రీంకోర్టు  స్టే  ఇవ్వడాన్ని  ఆయన  స్వాగతించారు.అమరావతిని  చంద్రబాబు గ్రాఫిక్స్ చూపించారన్నారు. కానీ అమరావతిలో  ఎలాంటి  నిర్మాణాలు  చేయలేదన్నారు.  సుప్రీం వ్యాఖ్యలు  వికేంద్రీకరణకు  బలాన్ని ఇస్తున్నాయని  ఆయన  చెప్పారు. అన్ని ప్రాంతాలకు  న్యాయం  చేయాలనే  ఉద్దేశ్యంతో  తమ  ప్రభుత్వం  మూడు రాజధానులను  తెరమీదికి  తెచ్చిందన్నారు.  

రాజధానిని  నిర్ణయించాల్సింది  రాష్ట్ర ప్రభుత్వమేనన్నారు.సుప్రీంకోర్టు వ్యాఖ్యలతోనైనా  చంద్రబాబుకు  బుద్ది తెచ్చుకోవాలన్నారు.న్యాయస్థానాల  పని  న్యాయస్థానాలు, ప్రభుత్వం పని  ప్రభుత్వాలు  చేయాలన్నారు మంత్రి  రాంబాబు. మూడు  రాజధానుల  విషయంలో  ఇప్పటికైనా  అడ్డంకులు  సృష్టించడం  మానుకోవాలని ఆయన  చంద్రబాబును కోరారు. అమరావతి  రాజధాని  పెద్ద స్కామ్ అని ఆయన  అన్నారు. నిజమైన రైతులు ఆందోళన చెందాల్సిన  అవసరం లేదని రాంబాబు  చెప్పారు. పవన్  కళ్యాణ్  సినిమాల్లోనే హీరో  రాజకీయాల్లో  మాత్రం  జీరో  అంటూ మంత్రి రాంబాబు సెటైర్లు  వేశారు.

Latest Videos

 రౌడీసేన, అమ్ముడుపోయిన  సేన అంటూ  జనసేనపై  మంత్రి  మండిపడ్డారు.చంద్రబాబునాయుడు  సీఎంగా  ఉన్న సమయంలో  పవన్  కళ్యాణ్  ఎప్పుడైనా  మాట్లాడారా  అని  ఆయన  ప్రశ్నించారు. ఇప్పటంలో  స్థానికులతో  దొంగ సంతకాలు పెట్టించారని  మంత్రి ఆరోపించారు. వచ్చే  ఎన్నికల్లో  పవన్ కళ్యాణ్ భీమవరంలో పోటీ చేస్తారా  లేదా   గాజువాకలో  పోటీ చేస్తారా అనే విషయం  తెలియదన్నారు. అంతేకాదు  25  కంటే  ఎక్కువ సీట్లలో  పోటీ చేస్తారా,  ఏ పార్టీతో  కలిసి ఆయన ఎన్నికల్లో  పోటీ  చేస్తారనే  విషయమై  స్పష్టత  లేదని మంత్రి అంబటి  రాంబాబు ఎద్దేవా  చేశారు.  ఈ ప్రశ్నలకు  పవన్ కళ్యాణ్  సమాధానం చెప్పాలని ఆయన  డిమాండ్  చేశారు.
 

click me!