పోలవరం ప్రాజెక్టులో కాఫర్ డ్యాం నిర్మించకుండా డయాఫ్రం నిర్మించడం టీడీపీ సర్కార్ చారిత్రక తప్పిదం చేసిందని ఏపీ రాస్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు.
కాకినాడ; Polavaram ప్రాజెక్టులో కాఫర్ డ్యాం నిర్మించకుండానే డయా ఫ్రం వాల్ నిర్మించడం చారిత్రక తప్పిదమని ఏపీ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి Ambati Rambabu చెప్పారు.
బుధవారం నాడు ఏపీ రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు ధవళేశ్వరం బ్యారేజీ నుండి గోదావరికి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
కాఫర్ డ్యాం నిర్మించకుండానే డయాఫ్రంవాల్ నిర్మించడాన్ని TDP నేతలు ఎలా సమర్ధించుకుంటారని ఆయన ప్రశ్నించారు. ఈ విషయమై Chandrababu, Devineni Uma Maheswara Raoతో చర్చించేందుకు తాను సిద్దంగా ఉన్నానని ఆయన ప్రకటించారు. కాఫర్ డ్యాం నిర్మించకుండా డయాఫ్రం వాల్ నిర్మాణంపై మేథావులు, ఇంజనీర్లు, మీడియాలో చర్చ జరగాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
2018 నాటికి పోలవరం పూర్తి చేసేసి నీళ్లు ఇస్తానన్న చంద్రబాబు, దేవినేని ఉమాలు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారనని ప్రశ్నించారు. టీడీపీ సర్కార్ తెలివితక్కువ పని వల్ల ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరుగుతోందన్నారు.
also read:టీడీపీకి పట్టిన శని : లోకేష్ పై ఏపీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్
డయాఫ్రం వాల్ రిపేర్ చేయాలా? లేదంటే పునర్నిర్మించాలా? అనే విషయంపైనే ఇప్పుడు ఇరిగేషన్ నిపుణులు ఆలోచిస్తున్నారన్నారు. భారీ ప్రాజెక్టు నిర్మాణంలో కచ్చితంగా జాప్యం జరుగుతుందని ఆయన చెప్పారు.
పోలవరం ప్రాజెక్టు విషయంలో అనేక అంశాలు ఇమిడి ఉంటాయని ఆయన వివరించారు. పోలవరం ఫలానా డేట్ కు పూర్తవుతుందని స్పష్టంగా చెప్పలేము. త్వరిత గతిన పూర్తి చేయడానికి విస్తృతంగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మంత్రి అంబటి రాంబాబు చెప్పారు.