బాబు కళ్లలో ఆనందం కోసమే: అసెంబ్లీలో బాలకృష్ణ విజిల్ ఊదడంపై అంబటి కౌంటర్

Published : Sep 22, 2023, 10:45 AM IST
బాబు కళ్లలో ఆనందం కోసమే: అసెంబ్లీలో బాలకృష్ణ విజిల్ ఊదడంపై అంబటి కౌంటర్

సారాంశం

ఏపీ అసెంబ్లీలో  టీడీపీ ఎమ్మెల్యే  బాలకృష్ణ విజిల్ వేయడంపై  మంత్రి అంబటి రాంబాబు కౌంటరిచ్చారు.


అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో  టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ విజిల్ ఊదుతూ  నిరసన వ్యక్తం చేయడంపై  మంత్రి అంబటి రాంబాబు  కౌంటరిచ్చారు.ఏపీ అసెంబ్లీలో టీడీపీ చీఫ్ చంద్రబాబు సీటుపై ఎక్కి టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ విజిల్ ఊదడంపై  మంత్రి అంబటి రాంబాబు ప్రస్తావించారు. తొలుత  చంద్రబాబు సీటుపై ఎక్కి  బాలకృష్ణ విజిల్ ఊదారు. ఆ తర్వాత అక్కడి నుండి స్పీకర్ పోడియం ముందు నిలబడి  విజిల్ వేస్తూ బాలకృష్ణ నిరసనకు దిగారు.

చంద్రబాబు సీట్లో కూర్చోనే అవకాశం వచ్చినా  బాలకృష్ణ కూర్చోవడం లేదన్నారు. తన తండ్రిని చంపిన బావ కళ్లలో ఆనందం చూసేందుకు బాలకృష్ణ ప్రయత్నిస్తున్నారని అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. చంద్రబాబు సీట్లో కూర్చోవాలని చెప్పినా కూర్చోవడం లేదన్నారు. అవకాశం వచ్చినా కూడ ఎందుకు ఆ సీట్లో కూర్చోవడం లేదన్నారు.  బాబు కళ్లలో ఆనందం చూసేందుకే బాలకృష్ణ ప్రయత్నిస్తున్నారన్నారు. చంద్రబాబు సీటుపై కాదు... చంద్రబాబుపై  ఎక్కి కూర్చోవాలని అంబటి రాంబాబు కోరారు. టీడీపీ సభ్యులు ఇలానే వ్యవహరిస్తే  వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి 23 సీట్లు దక్కవన్నారు. సింగిల్ డిజిట్‌ మాత్రమే  దక్కుతుందని  మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.

PREV
click me!

Recommended Stories

Ambati on Sankranthi Song: నేను సంక్రాంతికి గుర్తురావడానికి కారణం Pawan Kalyan | Asianet News Telugu
Journalists Arrest : జర్నలిస్టులను ఎందుకు అరెస్ట్ చేశారు.. అసలు ఏమిటీ వివాదం..?