పెళ్లి కూతురుగా ముస్తాబైన మంత్రి అఖిలప్రియ

Published : Aug 27, 2018, 10:55 AM ISTUpdated : Sep 09, 2018, 01:15 PM IST
పెళ్లి కూతురుగా ముస్తాబైన మంత్రి అఖిలప్రియ

సారాంశం

పెళ్లికి రెండు రోజులు ముందుగానే.. ఆమెకు మంగళ స్నానాలు చేయించి నవ వధువుగా  అలంకరించారు. ఆమె పెళ్లికూతురుగా ముస్తాబైన ఫోటోలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.   

ఏపీ పర్యాటకశాఖ మంత్రి అఖిల ప్రియ.. పెళ్లికూతురయ్యారు. అఖిలప్రియ వివాహం ఈ నెల 29న ఉదయం 10:57 గంటలకు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలోని భూమా శోభానాగిరెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాల ఆవరణలో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పెళ్లికి రెండు రోజులు ముందుగానే.. ఆమెకు మంగళ స్నానాలు చేయించి నవ వధువుగా  అలంకరించారు. ఆమె పెళ్లికూతురుగా ముస్తాబైన ఫోటోలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 

ఇప్పటికే.. వివాహ శుభ ప్రతికను ప్రముఖులందరికీ అందజేశారు. ఈ వివాహానికి సంబంధించిన ఆహ్వాన పత్రికలో భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిల ఫోటోలు  ముద్రించారు.  ఈ ఫోటోలతో ఆహ్వనపత్రికలో ఆకర్షణీయంగా ఉన్నాయి. ఈ వివాహానికి భూమా అభిమానులు కూడ పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశం ఉంది. దీంతో  ఏర్పాట్లను పెద్ద ఎత్తున చేస్తున్నారు.

read more news..

భూమా అఖిలప్రియ పెళ్లి: లారీ లోడ్ పెళ్లికార్డుల పంపిణీ, గోవా నుండి ఈవెంట్ టీమ్

భూమా దంపతుల ఫోటోలతో అఖిలప్రియ పెళ్లి పత్రిక

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే