షర్మిలను మిస్సవుతున్నా: జగన్ భావోద్వేగమైన ట్వీట్

First Published 26, Aug 2018, 9:08 PM IST
Highlights

రాఖీ పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని అక్కాచెల్లెమ్మలందరికీ వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసంకల్పయాత్రలో ఉండడం వల్ల ఈసారి రాఖీ పండుగ సందర్భంగా తన చెల్లెలు షర్మిలను మిస్‌ అవుతున్నానని ఆయన ట్వీట్‌ చేశారు. 

హైదరాబాద్‌: రాఖీ పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని అక్కాచెల్లెమ్మలందరికీ వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసంకల్పయాత్రలో ఉండడం వల్ల ఈసారి రాఖీ పండుగ సందర్భంగా తన చెల్లెలు షర్మిలను మిస్‌ అవుతున్నానని ఆయన ట్వీట్‌ చేశారు. 

షర్మిలకు తన ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని అన్నారు. ‘మిస్సింగ్‌ యూ ఆన్‌ రాఖీ.. షర్మీపాప.. బ్లెసింగ్స్‌ ఆల్వేస్‌’ అంటూ ఉద్వేగంగా ట్వీట్ చేశారు.

 

విశాఖపట్నం జిల్లా ధారభోగాపురం వద్ద వైఎస్‌ జగన్‌ ఆదివారం ఉదయం రక్షాబంధన్‌ వేడుకల్లో పాల్గొన్నారు. శాసనసభ్యురాలు రోజాతోపాటు పలువురు మహిళా నేతలు ఆయనకు రాఖీలు కట్టారు. 

జగన్ కు మిఠాయిలు తినిపించి.. ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే రోజా మాట్లాడారు. వైఎస్‌ జగనన్నకు రాఖీ కట్టినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయితే మహిళలకు రక్షణ ఉంటుందని చెప్పారు.  వైఎస్‌ జగన్‌ సీఎం కావాలని ప్రతి మహిళ కోరుకుంటోందని ఆమె అన్నారు.

Last Updated 9, Sep 2018, 11:04 AM IST