ఉక్రెయిన్ లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్ధులను రప్పించేందుకు అన్ని చర్యలు తీసుకొంటున్నామని ఏపీ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు.
అమరావతి: Ukraine లో చిక్కుకున్న Andrhra Pradesh విద్యార్ధులను రాష్ట్రానికి రప్పించేందుకు చర్యలు తీసుకొంటున్నామని ఏపీ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు.గురువారం నాడు ఉక్రెయిన్ లో చిక్కుకున్న ఏపీ విద్యార్ధులతో మంత్రి Adimulapu Suresh ఫోన్ లో మాట్లాడారు. విద్యార్ధులు ఉంటున్న ప్రాంతాల్లో పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. బాంబు దాడులు చోటు చేసుకొంటున్నాయా అనే విషయాలపై మంత్రి సురేష్ ఆరా తీశారు.
ఈ సందర్భంగా మంత్రి సురేష్ మీడియాతో మాట్లాడారు. ఉక్రెయిన్ లో ఉన్న విద్యార్ధులను రాష్ట్రానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్రానికి ఏపీ సీఎం YS Jagan లేఖ రాసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.విద్యార్థుల సహాయం కోసం నోడల్ అధికారి, స్పెషల్ ఆఫీసర్‌ను నియమించినట్లు మంత్రి చెప్పారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో అధికారులను అప్రమత్తం చేశామని మంత్రి సురేష్ వివరించారు.
undefined
ఇండియాకు చెందిన సుమారు 20 వేల మంది ఉక్రెయిన్ లో నివాసం ఉంటున్నారు. రష్యా మిలటరీ చర్యను ప్రారంభించిన తర్వాత ఉక్రెయిన్ తన గగనతలాన్ని ఇవాళ మూసివేసింది. ఉక్రెయిన్ అభ్యర్ధన మేరకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశాన్ని నిర్వహిస్తోంది.
ఉక్రెయిన్ ప్రభుత్వం తమ దేశంలోని తూర్పు ప్రాంతంలోని మిమానాశ్రయాలను అర్ధరాత్రి 7 గంటల నుండి మూసివేసింది. ఉక్రెయిన్ అభ్యర్ధన మేరకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశాన్ని నిర్వహిస్తోంది.
ఉక్రెయిన్ పై రష్యా దాడిని అన్యాయమైన దాడిగా అమెరికా అధ్యక్షుడు Joe Biden అభిప్రాయపడ్డారుఉక్రెయిన్ మిలటరీ ఆపరేషన్ కు రష్యా బాధ్యత వహించాల్సి ఉంటుందని అమెరికా తేల్చి చెప్పింది. రష్యా దాడికి ప్రతి చర్య తప్పదని జో బైడెన్ హెచ్చరించారు. ఉక్రెయిన్ కు నాటో దళాలు ఉక్రెయిన్ కు మద్దతుగా నిలుస్తున్నాయి.
ఉక్రెయిన్ పై తమ మిలటరీ చర్య విషయంలో ఇతరుల జోక్యాన్ని తాము సహించబోమని రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరించారు. జోక్యం చేసుకొన్న దేశాలు కూడా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని పుతిన్ హెచ్చరించారు.బుధవారం నాడు డోనెట్స్ , లుగాన్స్ వేర్పాటువాద నాయకులు పుతిన్ కు వేర్వేరుగా లేఖలు పంపారు. ఉక్రెయిన్ దూకుడును తిప్పికొట్టడానికి సహాయం చేయాలని కోరారు. ఈ విషయాన్ని పుతిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ తెలిపారు.
ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని పుతిన్ ప్రకటించారు. ఉక్రెయిన్ ను స్వాధీనం చేసుకొనే ఉద్దేశ్యం తమకు లేదని పుతిన్ తేల్చి చెప్పారు. రక్తపాతానికి ఉక్రెయిన్ పాలకులే బాధ్యత వహించాలని ఆయన ప్రకటించారు.వేర్పాటువాద ప్రాంతాల్లో పౌరుల రక్షణకు మిలటరీ ఆపరేషన్ నిర్వహిస్తున్నామని పుతిన్ వివరించారు. ఉక్రెయిన్ ను నాటోలో చేర్చవద్దనేది తమ డిమాండ్ అని పుతిన్ తెలిపారు. తమ డిమాండ్ ను అమెరికా దాని మిత్ర దేశాలు విస్మరించాయని ఆయన తెలిపారు.
రష్యా దళాలు ఉక్రెయిన్ లోకి చొచ్చుకెళ్లాయి. దీంతో దేశ రక్షన కోసం ప్రతి పౌరుడు ముందుకు రావాలని ఉక్రెయిన్ అధ్యక్సుడు జెలెన్ స్కీ కోరారు. ఈ మేరకు ఆయుధాలను కూడా ఇస్తామని జెలెన్ స్కీ ప్రకటించిన విషయం తెలిసిందే.