ఆంధ్రప్రదేశ్ Mega DSC...పరీక్షల షెడ్యూల్‌ కూడా వచ్చేసింది!

Published : May 31, 2025, 11:06 AM IST
no jobs for indian students in usa uk canada 2025

సారాంశం

ఏపీలో మెగా డీఎస్సీ పరీక్షలు షెడ్యూల్‌ విడుదల అయ్యింది. జూన్ 6 నుంచి 30 వరకు జరుగనున్నాయి. మొత్తం 3.35 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డీఎస్సీ 2024 పరీక్షల షెడ్యూల్ అధికారికంగా విడుదలైంది. స్కూల్ అసిస్టెంట్, ఎస్‌జీటీ, టీచర్ పోస్టుల భర్తీకి చేపట్టిన ఈ పరీక్షలు జూన్ 6వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది.గతంలో రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రకటించిన 16,347 పోస్టుల భర్తీ కోసం ఈ మెగా డీఎస్సీ నిర్వహించడం జరుగుతోంది. ఉద్యోగ అవకాశాల కోసం లక్షలాది మంది అభ్యర్థులు ముందుకొచ్చారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం, ఏపీతోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు కలిపి మొత్తం 3,35,401 మంది ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు.

అభ్యర్థుల సంఖ్య భారీగా ఉండటంతో పరీక్ష కేంద్రాలను రాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రాల్లోనూ ఏర్పాటు చేశారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశాల్లోని కొన్ని నగరాల్లోనూ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దరఖాస్తు సమయంలో అభ్యర్థులు ఎంచుకున్న ప్రాధాన్యతల మేరకు పరీక్ష కేంద్రాలను కేటాయించారు. చాలామందికి వారు ఎంచుకున్న  కేంద్రాల్లోనే పరీక్ష రాసే అవకాశం లభించింది.

ప్రతి అభ్యర్థికి హాల్ టికెట్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. పరీక్షలు కంప్యూటర్ ఆధారిత విధానంలో జరుగనున్నాయి. ఏపీలో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్న వేలాది మంది అభ్యర్థులకు ఈ మెగా డీఎస్సీ కీలక అవకాశంగా నిలవనుంది.

విద్యాశాఖ అధికారులు పరీక్షల ప్రామాణికతను కాపాడేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పరీక్షల సమయంలో శాంతియుత వాతావరణం కోసం పోలీస్ శాఖతో సమన్వయం చేస్తున్నారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా తమ పరీక్ష కేంద్రాలు, తేదీలు, ఇతర వివరాలను త్వరలో తెలుసుకోగలరు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Chandrababu Power Full Speech: అనకాపల్లిలో స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమం| Asianet News Telugu
Kandula Durgesh Super Speech: Amarajeevi Jaladhara Scheme Foundation Ceremony | Asianet News Telugu