ఏపీ లోకాయుక్త సంచలన తీర్పు .. 60 ఏళ్ల వివాదానికి పరిష్కారం , భార్య చేతికి అందిన పెన్షన్

Siva Kodati |  
Published : Dec 13, 2023, 09:26 PM IST
ఏపీ లోకాయుక్త సంచలన తీర్పు .. 60 ఏళ్ల వివాదానికి పరిష్కారం , భార్య చేతికి అందిన పెన్షన్

సారాంశం

దాదాపు 60 ఏళ్లుగా భర్త మృతి కారణంగా తనకు రావాల్సిన పెన్షన్ కోసం పోరాడుతున్న వృద్ధురాలికి న్యాయం చేశారు ఏపీ లోకాయుక్త జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి.  6 దశాబ్ధాల కాలానికి గాను మొత్తం రూ.15.70 లక్షల బకాయిలను చెల్లించాలని కాకినాడ ట్రెజరీ అధికారులను ఆదేశించారు. లోకాయుక్త ఆదేశాల మేరకు రూ.15.70 లక్షలను ట్రెజరీ అధికారులు ఆమెకు చెల్లించారు. 

దాదాపు 60 ఏళ్లుగా భర్త మృతి కారణంగా తనకు రావాల్సిన పెన్షన్ కోసం పోరాడుతున్న వృద్ధురాలికి న్యాయం చేశారు ఏపీ లోకాయుక్త జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి. వివరాల్లోకి వెళితే.. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కృష్ణవేణి అనే మహిళ భర్త 1962లో మరణించారు. దీంతో తనకు పెన్షన్ మంజూరు చేయాలంటూ కృష్ణవేణి అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. దాదాపు 60 ఏళ్లుగా ఆమె పోరాడుతున్నా ఫలితం దక్కకపోవడంతో 2021లో లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు.

దీనిని విచారణకు స్వీకరించిన జస్టిస్ లక్ష్మణ రెడ్డి.. 60 ఏళ్ల వివాదానికి పరిష్కారం చూపించారు. 6 దశాబ్ధాల కాలానికి గాను మొత్తం రూ.15.70 లక్షల బకాయిలను చెల్లించాలని కాకినాడ ట్రెజరీ అధికారులను ఆదేశించారు. లోకాయుక్త ఆదేశాల మేరకు రూ.15.70 లక్షలను ట్రెజరీ అధికారులు ఆమెకు చెల్లించారు. దీంతో కృష్ణవేణి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. 

కాగా.. జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి గతంలో ఎన్నో వినూత్నమైన కేసులను పరిష్కరించి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. కేవలం నాలుగేళ్ల కాలంలోనే లోకాయుక్తకు అందిన దాదాపు 9,141 కేసులు విచారించి తీర్పులు వెల్లడించారు. 2019 సెప్టెంబర్ 15న ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ విధంగా 2020లో 1928, 2021లో 2307, 2022లో 2874, 2023లో ఇప్పటి వరకు 2 వేలకు పైగా కేసుల్లో తీర్పులు వెలువరించారు. అంతేకాదు.. డిప్యూటీ లోకాయుక్త పోస్టులో ప్రభుత్వం ఎవరినీ నియమించకపోవడంతో ఆ బాధ్యతలను కూడా జస్టిస్ లక్ష్మణ్ రెడ్డే నిర్వర్తిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Road Doctor: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రోడ్డు డాక్ట‌ర్‌.. దేశం దృష్టిని ఆక‌ర్షిస్తోన్న స‌రికొత్త సేవ‌లు
IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!