హైదరాబాద్ గణేశ్ నిమజ్జనం.. గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్‌ మహాగణపతి

Siva Kodati |  
Published : Sep 19, 2021, 03:38 PM ISTUpdated : Sep 19, 2021, 03:58 PM IST
హైదరాబాద్ గణేశ్ నిమజ్జనం.. గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్‌ మహాగణపతి

సారాంశం

హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఇక నగరానికే ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం ఆదివారం పూర్తయ్యింది. పంచముఖ రుద్ర మహా గణపతి గంగమ్మ ఒడికి చేరాడు.

హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఇక నగరానికే ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం ఆదివారం పూర్తయ్యింది. పంచముఖ రుద్ర మహా గణపతి గంగమ్మ ఒడికి చేరాడు. ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన నాలుగో నంబర్‌ క్రేన్‌ ద్వారా మహా గణపతి నిమజ్జనం నిర్వహించారు. చివరి రోజు మహాగణపతి దర్శనం కోసం భారీగా భక్తులు తరలివచ్చారు. ఇవాళ ఉదయం 8.18 గంటలకు ప్రారంభమైన గణనాథుని శోభాయాత్ర.. భక్తుల కోలాహలం మధ్య సందడిగా కొనసాగింది. 9 రోజులుగా మహాగణపతి దర్శనం కోసం హైదరాబాద్‌ సహా వివిధ ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. ట్యాంక్‌బండ్‌పై తుదిపూజల అనంతరం మహాగణపతి నిమజ్జన ప్రక్రియ పూర్తిచేశారు.  

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్