స్థానిక పోరుపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ పట్టు: నీలం సాహ్ని అడ్డుపుల్ల

Published : Nov 18, 2020, 07:45 AM ISTUpdated : Nov 18, 2020, 07:57 AM IST
స్థానిక పోరుపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ పట్టు: నీలం సాహ్ని అడ్డుపుల్ల

సారాంశం

స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనే ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రయత్నాలకు సీఎస్ నీలం సాహ్ని అడ్డుపుల్ల వేశారు. ఎన్నికలు నిర్వహించడం ఇప్పుడు సాధ్యం కాదని నీలం సాహ్నీ స్పష్టం చేశారు.

అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికలను తన హయాంలోనే నిర్వహించాలనే పట్టుదలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) ఉంది. ఆయనను అడ్డుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు లేఖ రాశారు.

స్థానిక సంస్థల ఎన్నికలను ఇప్పుడు నిర్వహించతడం సాధ్యం కాదని ఆమె ఆ లేఖలో స్పష్టం చేశారు. కరోనా వైరస్ ఇంకా అదుపులోకి రాలేదని ఆమె చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో కరోనా వైరస్ యాక్టివ్ కేసులు ఇంకా ఉన్నాయని చెప్పారు. పోలీసు, జిల్లా యంత్రాంగాలు కరోనా కట్టడి విధుల్లో ఉన్నారని ఆమె చెప్పారు. 

Also Read: స్థానిక ఎన్నికలపై ఈసీ దూకుడు: రేపు గవర్నర్‌తో నిమ్మగడ్డ భేటీ

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్పారు. ఎన్నికలను నిర్వహించడానికి పట్టుదలతో ఉన్న రమేష్ కుమార్ ఈ రోజు బుధవారం గవర్నర్ బిశ్వభూషన్  ను కలుస్తున్నారు. 

గ్రామ పంచాయతీ ఎన్నికలపై ఎస్ఈసీ రమేష్ కుమార్ వివిధ స్థాయిల్లోని అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని నిర్ణయించారు. అయితే, నీలం సాహ్నీ లేఖతో ఈ వీడియో కాన్ఫరెన్స్ మీద సందిగ్ధత నెలకొంది. ఈ స్థితిలో అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం సాధ్యం కాదని నీలం సాహ్నీ స్పష్టం చేశారు. వీడియో కాన్ఫరెన్స్ మీద మరిన్ని సంప్రదింపులు జరగాలని అధికారులు అంటున్నారు.

Also Read: నిమ్మగడ్డ వైఖరిపై అనుమానాలున్నాయి: సజ్జల సంచలన వ్యాఖ్యలు

ఇదిలావుంటే, ప్రభుత్వ తీరుపై మరోసారి కోర్టును ఆశ్రయించేందుకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారని, బీహార్ శాసనసభ ఎన్నికలు జరిగాయని, ఈ స్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సాధ్యమేనని నిమ్మగడ్డ రమేష్ కుమార్ వాదిస్తున్నారు. 

నిమ్మగడ్డ రమేష్ కుమార్ వాదనలకు నీలం సాహ్ని తన లేఖలో ప్రతివాదనలు చేశారు. 

కరోనా కట్టడికి రాష్ట్రాలు వాటి పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకున్నాయని, ఎపీని ఇతర రాష్ట్రాలతో పోల్చడం సరి కాదని, చలికాలంలో మరింత అప్రమత్తత అవసరమని నీలం సాహ్నీ తన లేఖలో వివరించారు. ఎపీలో 6890 మంది కరోనా వల్ల మరణించారని, మరోసారి కరోనా వ్యాపించే ప్రమాదం ఉందని ఆమె అన్నారు. 

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పరిస్థితి అనుకూలించిన వెంటనే ప్రభుత్వం ఎస్ఈసీకి సమాచారం ఇస్తుందని ఆమె అన్నారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్యం, భద్రత దృష్ట్యా ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలని అనుకోవడం సరి కాదని ఆమె స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహించాలని తీసుకున్న నిర్ణయంపై పునరాలోచన చేయాలని ఆమె ఎస్ఈసీకి సూచించారు. 

ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వీడియో కాన్ఫరెన్స్ అవసరం లేదని తాము భావిస్తున్నామని ఆమె అన్నారు.

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Speech: తిరుపతి వెడ్డింగ్ హబ్ గా తయారవుతుంది | Wedding Hub | Asianet News Telugu
Chandrababu: స్వర్ణ నారావారిపల్లెకు శ్రీకారం చుట్టాం.. జీవనప్రమాణాలు పెంచాలి | Asianet News Telugu