ఎమ్మెల్యేలిచ్చే లేఖలపై తీసుకొన్న చర్యలపై సమాచారమివ్వాలి: అధికారులకు ప్రివిలేజ్ కమిటీ ఛైర్మెన్ ఆదేశం

By narsimha lode  |  First Published Jan 19, 2021, 3:37 PM IST

సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యేలు ఇచ్చే లేఖలకు సంబంధించి తీసుకొన్న చర్యల సమాచారం ఎప్పటికప్పుడు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ ఛైర్మెన్ కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్పారు.


తిరుపతి: సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యేలు ఇచ్చే లేఖలకు సంబంధించి తీసుకొన్న చర్యల సమాచారం ఎప్పటికప్పుడు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ ఛైర్మెన్ కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్పారు.

చిత్తూరు జిల్లాలో ప్రోటోకాల్ అమలు తీరుపై ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సమీక్ష నిర్వహించింది.  శాసనసభ్యుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత తమ కమిటీపై ఉందన్నారు. ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసిన కార్పోరేషన్ల ఛైర్మెన్లు, డైరెక్టర్లకు ప్రోటోకాల్ పై సందేహాలను కలెక్టర్ భరత్ గుప్తా అడిగి తెలుసుకొన్నారు. 

Latest Videos

undefined

also read:కంటతడి పెట్టుకొన్న ఎమ్మెల్యే రోజా: ప్రివిలేజ్ కమిటీ సమావేశంలో ఏడ్చిన నగరి ఎమ్మెల్యే

సోమవారం నాడు శాసనసభ హక్కుల కమిటీ ఎదుట నగరి ఎమ్మెల్యే రోజా కన్నీళ్లు పెట్టుకొన్నారు. నియోజకవర్గంలో అధికారులు కనీస మర్యాద ఇవ్వడం లేదని ఆమె ఆరోపించారు. రోజా లేవనెత్తిన అంశాలపై ప్రివిలేజ్ కమిటీ జిల్లా కలెక్టర్ గుప్తాతో చర్చించారు. 

జిల్లాలో అధికారులు తన మాట వినడం లేదని ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించడం లేదని రోజా ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. ీ సమయంలో ఆమె కన్నీరు పెట్టుకొన్నారు.
 

click me!