ప్రజాస్వామ్యాన్ని లెక్కచేయని క్రూరుడు జగన్‌రెడ్డి: చంద్రబాబు సంచలనం

Arun Kumar P   | Asianet News
Published : Jan 19, 2021, 01:54 PM IST
ప్రజాస్వామ్యాన్ని లెక్కచేయని క్రూరుడు జగన్‌రెడ్డి: చంద్రబాబు సంచలనం

సారాంశం

మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలకు నిరసనగా దీక్షకు సిద్దమైన మాజీ మంత్రి దేవినేని ఉమను పోలీసులు అరెస్ట్ చేేయడాన్ని మాజీ సీఎం,టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తప్పుబట్టారు. 

మంగళగిరి: ప్రజల పక్షాన మాట్లాడినవారిపై వైసిపి ప్రభుత్వం దాడులు చేయిస్తోందని... సీఎం జగన్‌ ప్రోద్భలంతోనే ఈ దాడులు జరుగుతున్నాయని టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. టిడిపి సీనియర్ నాయకులు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రజాస్వామ్యయుతంగా, శాంతియుతంగా దీక్ష చేస్తుంటే అక్రమంగా అరెస్టు చేయడాన్ని పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. 

''భౌతిక దాడులకు దిగుతామన్న మంత్రిపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా తెలుగుదేశం పార్టీ నేతలను అక్రమ అరెస్టులు చేయడం పౌరహక్కుల ఉల్లంఘన అవుతుంది. ప్రజాస్వామ్యాన్ని లెక్కచేయని క్రూర స్వభావం జగన్‌రెడ్డిది. ఆయన పాలనలో రాష్ట్రం గూండాలకు అడ్డాగా మారిపోయింది. నిన్న నెల్లూరులో ఒక ఎమ్మెల్యే జిల్లా ఎస్పీని బహిరంగంగా బెదిరింపులకు దిగితే, నేడు ఒక మంత్రి దాడులకు పాల్పడతానంటూ మాట్లాడుతున్నారు. జగన్‌రెడ్డి ప్రోద్భలంతోనే వైసీపీ నేతలు అనైతిక చర్యలకు పాల్పడుతున్నారు'' అని చంద్రబాబు ఆరోపించారు.

read more  రాత్రి నుండి పదిసార్లు ఫోన్ చేశా, ఫోన్ ఎత్తలేదు: దేవినేనిపై కొడాలి మరోసారి ఫైర్

''దేవినేని ఉమా ఇంటికి వచ్చి బడితెపూజ చేస్తామంటూ నేరపూరిత వ్యాఖ్యలు చేసిన మంత్రి కొడాలి నానిపై ఇంతవరకు కేసు నమోదు చేయకుండా తెదేపా నేతలను అదుపులోకి తీసుకుంటారా? రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? ప్రజల పక్షాన మాట్లాడితే దాడులు చేస్తారా? అవినీతి, అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు మంత్రి బరితెగించి వ్యవహరిస్తున్నారు'' అన్నారు.

''అరెస్టు చేసిన తెలుగుదేశం పార్టీ నేతలను వెంటనే విడుదల చేసి, ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా వ్యవహరించిన మంత్రి కొడాలి నాని, వైసీపీ నేతలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి'' అని చంద్రబాబు డిమాండ్‌ చేశారు.


 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?