నీ ఇంటికే వస్తా, తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకోం: దేవినేనికి వల్లభనేని కౌంటర్

Published : Jan 19, 2021, 03:08 PM IST
నీ ఇంటికే వస్తా, తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకోం: దేవినేనికి వల్లభనేని కౌంటర్

సారాంశం

:సీఎం జగన్ పై తప్పుడు ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మాజీ మంత్రి దేవినేని ఉమను హెచ్చరించారు.

విజయవాడ:సీఎం జగన్ పై తప్పుడు ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మాజీ మంత్రి దేవినేని ఉమను హెచ్చరించారు.

మంగళవారం నాడు విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వం ఏం చేసిందో... చంద్రబాబు ప్రభుత్వం ఏం చేసిందో చర్చకు సిద్దంగా ఉన్నామన్నారు. 

నీ ఇంటికి రమ్మంటే అక్కడే చర్చిద్దాం.. లేదంటే కొడాలి నాని ఇంటి దగ్గర చర్చకు రమ్మని సవాలు విసిరారు.

చంద్రబాబు డ్రామా కంపెనీ నడుపుతున్నారన్నారు. అందులో కుక్కలు, పందులు వంటి వివిధ రకాల జంతువులున్నాయని ఆయన విమర్శించారు..అందులో దేవినేని ఉమ ఒక రకమని ఎద్దేవా చేశారు. 

 ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దేశంలోనే ఏ సీఎం చేయని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ఈ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్నాయన్నారు. దీంతో చంద్రబాబుకు భయం పట్టుకొందని చెప్పారు. 

 మళ్లీ ఎప్పటికీ అధికారంలోకి రామనే భయంతోనే చంద్రబాబు, దేవినేని ఉమ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన  విమర్శించారు. రాజకీయ ఆరోపణలు సహజమని, కానీ వ్యక్తిగత ఆరోపణలకు దిగితే సహించేది లేదని హెచ్చరించారు. 

also read:రాత్రి నుండి పదిసార్లు ఫోన్ చేశా, ఫోన్ ఎత్తలేదు: దేవినేనిపై కొడాలి మరోసారి ఫైర్

2014కి ముందు చంద్రబాబు అధికారంలోకి రావడానికి ఎన్ని హామిలిచ్చారు? ఎన్ని నేరవేర్చారని ఆయన నిలదీశారు. ఇక ఎన్టీఆర్‌ మరణానికి కారణమైన చంద్రబాబు, దేవినేనిలకు ఆయన విగ్రహాన్ని ‌ముట్టుకునే అర్హతే లేదని తేల్చి చెప్పారు. 

అసలు దేవినేని సిగ్గు లేని మనిషని, సీఎం వైఎస్‌ జగన్‌ను విమర్శించే స్థాయి ఆయనకెక్కడిదని దుయ్యబట్టారు. బహిరంగచర్చకు రమ్మంటే గొల్లపూడిలో నిరసన అంటూ డ్రామాలాడారని ఆయన విమర్శించారు.
 

PREV
click me!

Recommended Stories

Deputy CM Pawan Kalyan Speech: ఆరడుగుల బుల్లెట్ నేను కాదురఘురామ పై పవన్ పంచ్ లు | Asianet Telugu
CM Chandrababu Naidu: స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్రలో చిన్నారితో బాబు సెటైర్లు | Asianet News Telugu