సెలెక్ట్ కమిటీ ఏర్పాటులో తొలి అడుగు: పేర్లు ఇవ్వాలని పార్టీలకు షరీఫ్ లేఖ

By narsimha lodeFirst Published Jan 26, 2020, 3:45 PM IST
Highlights

సెలెక్ట్ కమిటీ ఏర్పాటు కోసం పేర్లు ఇవ్వాలని ఆయా పార్టీలకు శాసనమండలి ఛైర్మెన్ ఎంఏ షరీప్ లేఖ రాశారు. 


అమరావతి:పాలనా వికేంద్రీకరణ బిల్లులు, సీఆర్‌డీఏ బిల్లులపై సెలెక్ట్ కమిటీ ఏర్పాటుకు సంబంధించి తమ పార్టీలకు చెందిన సభ్యుల పేర్లను ఇవ్వాలని ఏపీ శాసనమండలి ఛైర్మెన్ ఎంఏ షరీఫ్ ఆదివారం నాడు ఆయా రాజకీయ పార్టీలకు లేఖ రాశారు.

Also read:ఏపీ శాసనమండలి రద్దుకు రేపే ముహుర్తం: తేల్చేసిన జగన్

ఒక్కో కమిటీలో కనీసం తొమ్మిది మంది ఉంటారని శాసనమండలి ఛైర్మెన్ ఎంఏ షరీఫ్ ప్రకటించారు. ప్రతి సెలెక్ట్ కమిటీలో టీడీపీ నుండి ఐదుగురు,వైసీపీ, బీజేపీ, పీడీఎఫ్ నుండి ఒక్కో సభ్యుడు ఉన్నారు.

శాసనమండలిలో  పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లులను ప్రవేశపెట్టిన మంత్రులు ఆయా సెలెక్ట్ కమిటీలకు ఛైర్మెన్లుగా ఉంటారు. ఆయా కమిటీల్లో ఉండే సభ్యుల పేర్లను ఇవ్వాలని మండలి ఛైర్మెన్లు ఆదివారం నాడు షరీఫ్ లేఖ రాశారు.

ఏపీ శాసనమండలిలో టీడీపీకి 32 మంది సభ్యులున్నారు. డొక్కా మాణిక్య వరప్రసాద్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు.  మాణిక్యవరప్రసాద్ రాజీనామా ఇంకా ఆమోదం తెలపలేదు. దీంతో మాణిక్య వరప్రసాద్ టెక్నికల్ గా మెంబర్ గా కొనసాగుతున్నట్టే.నని చెబుతున్నారు.

శాసనమండలిలో బిల్లులు ప్రవేశపెట్టిన మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బొత్స సత్యనారాయణలు ఆయా కమిటీలకు  ఛైర్మెన్ లుగా ఉంటారు. 

click me!