గోవాలో జగ్గయ్యపేట వైద్యురాలి మృతి

Published : May 16, 2019, 02:57 PM IST
గోవాలో జగ్గయ్యపేట వైద్యురాలి మృతి

సారాంశం

గోవాలో సెల్ఫీ తీసుకొంటుండగా అలల తాకిడికి సముద్రంలో కొట్టుకుపోయిన డాక్టర్ రమ్యకృష్ణ మృతి చెందింది. రమ్యకృష్ణ స్వగ్రామం కృష్ణా జిల్లా జగ్గయ్యపేట. మూడేళ్లుగా గోవాలోని ప్రైవేట్ ఆసుపత్రిలో ఆమె వైద్యురాలిగా పని చేస్తోంది.  

జగ్గయ్యపేట: గోవాలో సెల్ఫీ తీసుకొంటుండగా అలల తాకిడికి సముద్రంలో కొట్టుకుపోయిన డాక్టర్ రమ్యకృష్ణ మృతి చెందింది. రమ్యకృష్ణ స్వగ్రామం కృష్ణా జిల్లా జగ్గయ్యపేట. మూడేళ్లుగా గోవాలోని ప్రైవేట్ ఆసుపత్రిలో ఆమె వైద్యురాలిగా పని చేస్తోంది.

కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని మార్కండేయ నగర్‌కు చెందిన రమ్యకృష్ణ ఎంబీబీఎస్ పూర్తి చేసింది. కొంత కాలం జగ్గయ్యపేట పీహెచ్‌సీలో పనిచేసింది. ఆ తర్వాత మూడేళ్లుగా గోవాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తోంది. రమ్యకృష్ణ తండ్రి కొన్నేళ్ల క్రితం మృతి చెందాడు. 

మంగళవారం నాడు స్నేహితులతో కలిసి బీచ్‌కు వెళ్లింది.  బీచ్‌లో సెల్ఫీ తీసుకొంటున్న సమయంలో అలలు ఒక్కసారిగా ఆమెను సముద్రంలోకి లాక్కెళ్లాయి. రమ్యకృష్ణతో పాటు ఆమె స్నేహితురాలు కూడ సముద్రంలో కొట్టుకుపోయారు. రమ్యకృష్ణ స్నేహితురాలిని స్థానికులు కాపాడారు. రమ్యకృష్ణను మాత్రం కాపాడలేకపోయారు. ఈ విషయం తెలిసిన కుటుంబసబ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్