ప్రియురాలితో వెళ్లి శవంగా మారిన ప్రియుడు

Published : May 16, 2019, 01:49 PM IST
ప్రియురాలితో వెళ్లి శవంగా మారిన ప్రియుడు

సారాంశం

ప్రియురాలితో ఏకాంతంగా బైక్‌పై వెళ్లిన యువకుడు రైల్వేట్రాక్‌పై అనుమానాస్పదస్థితిలో మృత్యువాత పడిన ఘటన కర్నూల్ జిల్లాలోని డోన్‌లో చోటు చేసుకొంది


డోన్: ప్రియురాలితో ఏకాంతంగా బైక్‌పై వెళ్లిన యువకుడు రైల్వేట్రాక్‌పై అనుమానాస్పదస్థితిలో మృత్యువాత పడిన ఘటన కర్నూల్ జిల్లాలోని డోన్‌లో చోటు చేసుకొంది. రైలు ఢీకొనడంతోనే ప్రియుడు చనిపోయినట్టుగా ప్రియురాలు చెబుతోంది. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

డోన్ మండలంలోని మాల్యాల గ్రామంలో ఈ ఘటన  చోటు చేసుకొంది. మనోహార్ అనే  యువకుడు కొంత కాలంగా ఓ యువతితో ప్రేమిస్తున్నాడు. ప్రేమికులిద్దరూ బుధవారం నాడు ఏకాంతం కోసం బైక్‌పై వెళ్లారు. అయితే బైక్‌ను దూరంగా ఆపి రైల్వేట్రాక్‌కు వెపుకు వెళ్లిన సమయంలో రైలు ఢీకొట్టడంతో ప్రియుడు మనోహార్ మృతి చెందినట్టుగా ప్రియురాలు చెబుతోంది.

ఈ విషయమై ప్రియురాలి మాటలపై  మృతుడి కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనుమానాస్పద స్థితిలో మనోహార్ మృతి చెందినట్టుగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.ప్రియురాలి సెల్‌ఫోన్‌ను కూడ పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్