పర్యాటకులను ఆకర్శించడంలో 3వ స్థానంలో నిలిచిన ఏపీ, 6వ స్థానంలో తెలంగాణ

By team teluguFirst Published Dec 6, 2022, 9:54 AM IST
Highlights

2021 సంవత్సరంలో పర్యాటకులను ఆకర్శించడంలో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో నిలిచింది. అలాగే తెలంగాణ ఆరో స్థానంలో నిలిచింది. ఈ గణాంకాలను తాజాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. 

దేశీయ పర్యాటకుల సందర్శన (డీటీవీ) జాబితాను కేంద్రం తాజాగా విడుదల చేసింది. ఇందులో 2021 సంవత్సరంలో పర్యాటకులను ఆకర్శిచడంతో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉండగా.. తెలంగాణలో 6 స్థానంలో నిలిచింది. కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియా టూరిజం స్టాటిస్టిక్స్- 2022,  63వ ఎడిషన్ ప్రకారం.. ఏపీ 9.32 కోట్ల మంది దేశీయ పర్యాటకులను ఆకర్షించింది. అంటే దేశ వ్యాప్తంగా 13.8 శాతం పర్యాటకులు ఏపీనే సందర్శించారు. తెలంగాణకు 2 కోట్ల మంది విచ్చేయగా.. జాతీయ స్థాయిలో 4.7 శాతంగా నిలిచింది.

కాంగ్రెస్ భార‌త్ జోడో యాత్ర‌లో 'మోడీ మోడీ' అంటూ నినాదాలు.. రాహుల్ గాంధీ ఏం చేశారంటే..

11.53 కోట్ల దేశీయ పర్యాటక సందర్శనలతో (17.02 శాతం) తమిళనాడు అగ్రస్థానంలో నిలిచింది. ఉత్తరప్రదేశ్ 10.97 కోట్లతో (16.19 శాతం) రెండో స్థానంలో ఉంది. డీవీటీ నివేదిక ప్రకారం 2021లో దేశవ్యాప్తంగా మొత్తంగా 67.76 కోట్లు సంపాదించి, 11.05 శాతం వృద్ధిని నమోదు చేసింది. హోటళ్లు, ఇతర వసతి సంస్థల నుంచి సేకరించిన నెలవారీ రిటర్న్స్ ఆధారంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా ఈ డేటాను క్రోడీకరించారు.

నడి వీధిలో.... వింత తోడేలు... వీడియో వైరల్..!

మెరుగైన మౌలిక సదుపాయాలు, యునెస్కో గుర్తింపు వంటి కారణాల వల్ల రామప్ప దేవాలయానికి ఈ ర్యాంకు వచ్చిందని టీఎస్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్డీడీసీ) సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. “మెరుగైన రోడ్డు కనెక్టివిటీ, మంచి సౌకర్యాలతో వసతి కల్పించడం ద్వారా మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం విస్తృతంగా కృషి చేస్తోంది. అంతేకాదు ఇటీవల ములుగులోని రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు, నగరానికి లభించిన తాజా అవార్డులు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి’’ అని చెప్పారు.

డిప్రెషన్‌తో 10వ అంతస్తు బాల్కనీ నుంచి దూకేసిన ఎన్నారై వ్యాపారి 

ఆంధ్రప్రదేశ్‌లో ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మంచి సౌకర్యాలతో ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేయడంతో మెరుగైన ర్యాంకును సాధించింది. పర్యాటకుల కోసం కార్పొరేషన్ యాజమాన్యంలోని హరిత గ్రూప్ హోటళ్లలో సరసమైన ధరలోనే వసతి సౌకర్యం కల్పిస్తోంది. ఏపీకి వచ్చే దేశీయ పర్యాటకుల్లో ఎక్కువ మంది తిరుపతి, విజయవాడ, శ్రీశైలం తదితర ప్రాంతాల్లోని దేవాలయాలను సందర్శిస్తుండగా, విశాఖపట్నంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను కూడా సందర్శిస్తున్నారని ఏపీటీడీసీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారని ‘డెక్కన్ క్రానికల్’ కథనం నివేదించింది. 

click me!