నేడే ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు..

Published : Apr 26, 2023, 07:15 AM IST
నేడే ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు..

సారాంశం

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈరోజు సాయంత్రం వీటిని విడుదల చేస్తారు. రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు ఏప్రిల్ 4వ తేదీన ముగిశాయి.

నేడు ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు చేసేందుకు విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఫలితాలను నేటి సాయంత్రం 5 గంటలకు ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేస్తారు. ఈ సంవత్సంర మార్చి 15వ తేదీన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభం కాగా.. మార్చి 16వ తేదీన రెండో సంవత్సరం పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఏప్రిల్ 4వ తేదీన ఈ పరీక్షలు పూర్తయ్యాయి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 1,489 కేంద్రాల్లో 10,03,990 మంది విద్యార్ధులు పరీక్షలు రాశారు. ఇందులో మొదటి సంవత్సరం విద్యార్థులు 4,84,197 మంది ఉండగా.. రెండో సంవత్సరానికి చెందిన విద్యార్థులు 5,19,793 మంది ఉన్నారు. పరీక్షా ఫలితాలు విడుదల కానున్న నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఉత్కంఠ నెలకొంది. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్