జీవో నెం. 35 అమల్లోనే వుంది.. రద్దయ్యింది ఈ థియేటర్లకే: సినిమా టికెట్ రేట్లపై ఏపీ హోంశాఖ క్లారిటీ

By Siva Kodati  |  First Published Dec 16, 2021, 5:40 PM IST

ఏపీలో పాత పద్ధతిలోనే సినిమా టికెట్లు అమ్ముకోవచ్చంటూ జీవో నెం. 35ని ఇటీవల న్యాయస్థానం కొట్టివేసిన సంగతి తెలిసిందే.  ఈ నేపథ్యంలో ఏపీ హోంశాఖ ముఖ్యకార్యదర్శి రాష్ట్రంలో సినిమా టికెట్ల రేట్లపై క్లారిటీ ఇచ్చారు. ఏపీలో సినిమా టికెట్ ధరల తగ్గింపునకు సంబంధించిన జీవో నెం.35 అమల్లోనే ఉందని వెల్లడించారు


ఏపీలో పాత పద్ధతిలోనే సినిమా టికెట్లు అమ్ముకోవచ్చంటూ జీవో నెం. 35ని ఇటీవల న్యాయస్థానం కొట్టివేసిన సంగతి తెలిసిందే.  ఈ నేపథ్యంలో ఏపీ హోంశాఖ ముఖ్యకార్యదర్శి రాష్ట్రంలో సినిమా టికెట్ల రేట్లపై క్లారిటీ ఇచ్చారు. ఏపీలో సినిమా టికెట్ ధరల తగ్గింపునకు సంబంధించిన జీవో నెం.35 అమల్లోనే ఉందని వెల్లడించారు. జీవో 35పై హైకోర్టు తీర్పు పిటిషనర్లకు మాత్రమే వర్తిస్తుందని తెలిపారు. హైకోర్టు తీర్పు కాపీలో ఈ విషయంగా స్పష్టంగా పేర్కొన్నారని ఆయన వివరించారు.

టికెట్ల రేట్ల జీవో నెం.35పై హైకోర్టులో వేర్వేరుగా రిట్ పిటిషన్లు దాఖలు కాగా, 3 పిటిషన్లకు కలిపి ఒకేసారి విచారణ, తీర్పు ఇచ్చినట్టు హోంశాఖ సెక్రటరీ పేర్కొన్నారు. దాని ప్రకారం... తెనాలిలో 4 థియేటర్లు, చోడవరంలో 1 థియేటర్ కు పాత పద్ధతిలోనే టికెట్ల విక్రయాలకు అనుమతి ఇచ్చినట్టు తెలిపారు. ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి జిల్లాల్లోని 225 థియేటర్లకు కూడా హైకోర్టు తీర్పు వర్తిస్తుందని పేర్కొన్నారు. ఈ థియేటర్లకు మాత్రమే హైకోర్టు జీవో నెం.35ని సస్పెండ్ చేసిందని హోంశాఖ ముఖ్యకార్యదర్శి వివరణ ఇచ్చారు.

Latest Videos

మరోవైపు సినిమా టికెట్ల ధరల తగ్గింపుపై ఏపీ హైకోర్టు గురువారం నాడు కీలక ఆదేశాలు జారీ చేసింది. థియేటర్ల యాజమాన్యాలు టికెట్ ధరల ప్రతిపాదనలను జాయింట్ కలెక్టర్ల ముందుంచాలని ఆయనే నిర్ణయం తీసుకొంటారని ఏపీ హైకోర్టు సూచించింది. ఈ కేసు విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరల తగ్గింపుపై సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ జగన్ సర్కార్ హైకోర్టు డివిజన్ బెంచ్‌లో బుధవారం నాడు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించింది హైకోర్టు.

Also Read:జగన్ సర్కార్‌కి షాక్: జీవో నెంబర్ 35 రద్దు, పాత విధానంలోనే సినిమా టికెట్ల ధరలు

ఇటీవల  జరిగిన  Assembly సమావేశాల్లో థియేటర్లలో టికెట్ల ను Online లో విక్రయించాలని చట్ట సవరణ చేసింది. నిర్ణయించిన ధరలకే సినిమా Tickets అమ్మాలని బెనిఫిట్స్ షోస్ వేయకూడదని కూడా స్పష్టం చేసింది.టికెట్ ధరలను తగ్గించింది. అయితే టికెట్ల ధరల తగ్గింపుపై సినీ పరిశ్రమలో పలువురు తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేశారు.కొత్త సినిమాలు విడుదలయ్యే సమయంలో టికెట్స్ రేట్స్ పెంచుకునే అవకాశం థియేటర్ యజమానులకు ఉంటుందని పిటిషనర్లు పేర్కోన్నారు. దీనిపై మంగళవారం విచారణ జరిగింది. థియేటర్ల యాజామాన్యాల తరపున సీనియర్ లాయర్లు ఆదినారాయణ రావు, దుర్గాప్రసాద్ వాదనలు వినిపించారు. 

టికెట్ల ధరలను తగ్గించే అధికారం ప్రభుత్వానికి లేదని తెలిపారు. పిటిషనర్ల తరపు న్యాయవాదుల వాదనతో ఏకీభవించిన హైకోర్టు ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం35ను సస్పెండ్ చేస్తున్నట్టు ఆదేశాలు జారీ చేసింది.అయితే సగటు ప్రేక్షకుడికి వినోదం అందించే సినిమా టికెట్ల ధరలను  ఇష్టారీతిలో  పెంచుకొనే విధానానికి తాము వ్యతిరేకమని ఏపీ ప్రభుత్వం తేల్చి చెప్పింది. సామాన్యుడికి అందుబాటులో ధరలు తీసుకొచ్చేందుకు వీలుగా సినిమా టికెట్ల ధరలను తగ్గించినట్టుగా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ కారణంగానే సింగిల్ జడ్జి తీర్పును డివిజన్ బెంచ్‌లో సవాల్ చేశామని ప్రభుత్వం  తెలిపింది.

click me!