ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. దసరా సెలవుల తర్వాత విచారణ చేయనున్నట్టుగా ఏపీ హైకోర్టు తెలిపింది.
అమరావతి: ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది.ఈ పిటిషన్ పై విచారణను వెకేషన్ కోర్టుకు ఏపీ హైకోర్టు బదిలీ చేసింది.
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణను ఇవాళ మధ్యాహ్ననికి ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. ఇవాళ మధ్యాహ్నం ఈ పిటిషన్ పై విచారణ ప్రారంభమైంది.విచారణ ప్రారంభం కాగానే ఈ పిటిషన్ పై విచారణను వెకేషన్ బెంచ్ కు బదిలీ చేయాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు కోరారు.చంద్రబాబు న్యాయవాదుల అభ్యర్థనను ఏపీ హైకోర్టు అంగీకరించింది.
undefined
దసరా సెలవుల్లో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై వెకేషన్ బెంచ్ విచారణ చేపట్టనుంది. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై వెకేషన్ బెంచ్ కు నివేదిక ఇవ్వాలని జైలు అధికారులను ఏపీ హైకోర్టు ఆదేశించింది. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై దాఖలైన ఐఏ పిటిషన్ పై వెకేషన్ బెంచ్ విచారణ నిర్వహించనుందని ఏపీ హైకోర్టు తెలిపింది. మళ్లీ విచారణ నాటికి చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై మెడికల్ రిపోర్టును హైకోర్టు ముందుంచాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది.
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు తరపు న్యాయవాదులు సెప్టెంబర్ 14న బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఇరు వర్గాల వాదనలను విన్న ఏసీబీ కోర్టు ఈ నెల 9న చంద్రబాబు బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది.దీంతో ఈ నెల 12న చంద్రబాబు తరపు న్యాయవాదులు ఏపీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
also read:ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసు: బాబు బెయిల్ పిటిషన్ పై విచారణ నేటి మధ్యాహ్ననికి వాయిదా
ఈ పిటిషన్ పై ఇరు వర్గాల వాదనలను విన్న ఏసీబీ కోర్టు ఈ నెల 9న చంద్రబాబు బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది.దీంతో ఈ నెల 12న చంద్రబాబు తరపు న్యాయవాదులు ఏపీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిగింది. రేపటి నుండి ఏపీ హైకోర్టుకు సెలవులు కావడంతో వెకేషన్ బెంచ్ కు బదిలీ చేయాలని ఏపీ హైకోర్టును చంద్రబాబు లాయర్లు కోరారు.చంద్రబాబు వినతిని ఏపీ హైకోర్టు అంగీకరించింది. వెకేషన్ బెంచ్ ఈ పిటిషన్ పై విచారణ చేయనుందని తెలిపింది.