మాజీ మంత్రి కొల్లు రవీంద్ర భార్య నీలిమ దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ పై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది.
విజయవాడ: మాజీ మంత్రి కొల్లు రవీంద్ర భార్య నీలిమ ఏపీ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో బుధవారంనాడు విచారణ జరగనుంది. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ను అక్రమంగా నిర్భంధించారని హైకోర్టులో నీలిమ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ నెల 16న మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అక్రమంగా నిర్భంధించారని ఆయన సతీమణి పిటిషన్ దాఖలు చేశారు.పూజకు వెళ్తున్న సమయంలో తన భర్తను అక్రమంగా నిర్భంధించి పలు స్టేషన్లకు తిప్పారని ఆ పిటిషన్ లో నీలిమ ఆరోపించారు.
undefined
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అక్రమమని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర సైకిల్ యాత్రకు ఈ నెల 16న పిలుపునిచ్చారు.ఈ యాత్రలో భాగంగా మచిలీపట్టణం ఆలయంలో పూజకు వెళ్తున్న సమయంలో పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. సైకిల్ యాత్రకు అనుమతి లేదని కొల్లు రవీంద్ర ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శాంతి యుతంగా సైకిల్ యాత్ర చేయడాన్ని అడ్డుకోవడంపై జగన్ ప్రభుత్వంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. కొల్లు రవీంద్ర అరెస్ట్ ను తప్పుబడుతున్నారు. ఈ విషయమై చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కూడ స్పందించారు. టీడీపీ నేతలు, కార్యకర్తల నిర్బంధం తీవ్ర ఆవేదన కల్గిస్తుందన్నారు.కొల్లు రవీంద్ర పట్ల ప్రభుత్వ వైఖరి తనను ఎంతో బాధించిందన్నారు.తల్లి వర్ధంతి కార్యక్రమాలకు కూడ వెళ్లకుండా అడ్డుకుంటారా అని భువనేశ్వరి ప్రశ్నించారు.
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును ఈ ఏడాది సెప్టెంబర్ 9న ఏపీ సీఐడీ అరెస్ట్ చేసింది.ఈ కేసులో అరెస్టైన చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు.చంద్రబాబు అరెస్ట్ ను నిరసిస్తూ టీడీపీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది.ఈ క్రమంలోనే కొల్లు రవీంద్ర సైకిల్ యాత్రను ప్రారంభించారు.ఈ సమయంలో పోలీసులు ఆయనను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 16న మాజీ మంత్రి రవీంద్రను అదుపులోకి తీసుకొని రాత్రి పదకొండున్నర గంటల సమయంలో వదిలేశారని కొల్లు రవీంద్ర భార్య నీలిమ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొన్నారు.