మైనర్ బాలిక కాళ్లుచేతులు కట్టేసి ... మృగంలా మీదపడి చెరిచిన కామాంధుడు

Published : Oct 18, 2023, 09:12 AM ISTUpdated : Oct 18, 2023, 09:14 AM IST
మైనర్ బాలిక కాళ్లుచేతులు కట్టేసి ... మృగంలా మీదపడి చెరిచిన కామాంధుడు

సారాంశం

అభం శుభం తెలియని ఓ మైనర్ బాలికను ఎత్తుకెళ్లిన ఓ కామాంధుడు కాళ్లుచేతులు కట్టేసి అత్యంత దారుణంగా అత్యాచారానికి పాల్పడిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో వెలుగుచూసింది. 

భీమవరం : అమ్మాయి ఒంటరిగా కనిపించిందంటే చాలు కొందరు మగాళ్లలోని మృగం మేల్కొంటుంది. చిన్నారులు,  వృద్దులని కూడా చూడటంలేదు... ఆడదైతే చాలని ఆఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇలా కీచకుల చేతిలో ఆడబిడ్డల మానమే కాదు కొన్నిసార్లు ప్రాణాలు బలవుతున్నాయి. ఇలా ఓ కామాంధుడు అభం శుభం తెలియని మైనర్ బాలికను అత్యంత ఘోరంగా అత్యాచారానికి పాల్పడిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో వెలుగుచూసింది. 

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వీరవాసరం మండలం పంజావేమవరం గ్రామంలో పంజా నాగేంద్ర కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. పవన్ కల్యాణ్ కు వీరాభిమాని అయిన ఇతడు జనసేన పార్టీ కార్యకర్తగా కొనసాగుతున్నాడు. అయితే  ఇదే గ్రామానికి చెందిన మైనర్ బాలికపై కన్నేసిన నాగేంద్ర రాత్రి సమయంలో దారుణానికి ఒడిగట్టాడు. 

గత సోమవారం రాత్రి తన ఇంటిబయట 14 ఏళ్ళ బాలిక ఒంటరిగా ఆడుకుంటుండటం నాగేంద్ర గమనించాడు. ఆ చుట్టుపక్కల కూడా ఎవరూ లేకపోవడంతో బాలికను బలవంతంగా ఎత్తుకెళ్లాడు. అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కి... కాళ్ళుచేతులు కట్టేసి ఊరిబయట నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. బాలికను వివస్త్రను చేసి దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. 

Read More  పదోతరగతి బాలికపై టీచర్ అత్యాచారం.. బెదిరించి పలుమార్లు అఘాయిత్యం.. పురుటినొప్పులు రావడంతో...

పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడిన నీచుడు ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని బాలికను బెదిరించాడు. కానీ బాలిక భయపడకుండా ఇంటికి వెళ్లగా తనపై  జరిగిన అఘాయిత్యం గురించి తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో వారు బాధిత బాలికను తీసుకుని మంగళవారం వీరవాసరం పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసుకుని బాలికను వైద్య పరీక్షలను పంపించినట్లు పోలీసులు తెలిపారు. బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన దుర్మార్గుడు నాగేంద్రను కఠినంగా శిక్షించాలని పంజావేమవరం గ్రామస్తులు పోలీసులను కోరుతున్నారు. 


 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్