జగన్ పై కోడికత్తి కేసులో కీలక పరిణామం: ఎన్ఐఏ కోర్టు విచారణపై 8 వారాల స్టే విధించిన ఏపీ హైకోర్టు

By narsimha lode  |  First Published Oct 17, 2023, 12:56 PM IST

ఏపీ సీఎం వైఎస్ జగన్ పై దాడి కేసు విచారణపై  ఏపీ హైకోర్టు  స్టే విధించింది. 



అమరావతి: ఏపీ సీఎం  వైఎస్ జగన్ పై  దాడి కేసు విచారణపై  ఏపీ హైకోర్టు  మంగళవారం నాడు స్టే విధించింది.  ఈ కేసుపై విచారణను ఆరు వారాల పాటు వాయిదా వేసింది  
సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్ పై  ఎన్ఐఏను కౌంటర్ దాఖలు చేయాలని కూడ ఏపీ హైకోర్టు ఇవాళ  ఆదేశించింది.

ఏపీ హైకోర్టు.కోడి కత్తి కేసులో  లోతైన విచారణ జరపాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ దాఖలు చేసిన పిటిషన్ ను ఎన్ఐఏ కోర్టు  తోసిపుచ్చింది. దీంతో  ఏపీ హైకోర్టులో  వైఎస్ జగన్  పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై ఏపీ హైకోర్టు  మంగళవారంనాడు కీలక ఆదేశాలు జారీ చేసింది. 

Latest Videos

undefined

2018  అక్టోబర్  25న  విశాఖపట్టణం విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్ లో  వైఎస్ జగన్ పై  కోడికత్తితో దాడి జరిగింది.ఈ ఘటనలో  జగన్ తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు. శ్రీనివాస్ అనే యువకుడు వైఎస్ జగన్ పై కోడి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో  జగన్ ఎడమ భుజానికి స్వల్పంగా గాయమైంది. శ్రీనివాస్ ను  పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ కేసును ఎన్ఐఏ విచారిస్తుంది.కోడికత్తి కేసులో  లోతైన విచారణ జరపాలని  కోరుతూ  ఎన్ఐఏ కోర్టులో  దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు తోసిపుచ్చింది.దీంతో ఈ నెల  14న  ఏపీ హైకోర్టులో సీఎం జగన్  పిటిషన్ దాఖలు చేశారు.

also read:కోడికత్తి కేసులో లోతైన దర్యాప్తు చేయించండి.. హైకోర్టులో జగన్ పిటిషన్...

ఈ కేసులో కుట్ర కోణం ఉందని బాధితుడు భావిస్తున్నందున లోతైన విచారణ జరపాల్సిన అవసరం ఉందని జగన్ తరపు న్యాయవాదులు వాదనలు విన్పించారు.ఈ తరహా పిటిషన్ ను ఎన్ఐఏ కోర్టు కొట్టివేసిన విషయాన్ని ఎన్ఐఏ తరపు న్యాయవాదులు హైకోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. ఇరు వర్గాల న్యాయవాదుల వాదనలు విన్న తర్వాత  విశాఖపట్టణం ఎన్ఐఏ కోర్టు జరుపుతున్న విచారణపై స్టే విధించింది.  ఎనిమిది వారాల పాటు  స్టే కొనసాగుతుందని  హైకోర్టు తెలిపింది. మరో వైపు ఈ పిటిషన్ పై విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది ఏపీ హైకోర్టు.

click me!