ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసు: చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ ఈ నెల 19కి వాయిదా

By narsimha lode  |  First Published Oct 17, 2023, 11:41 AM IST

చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణను ఏపీ హైకోర్టు ఈ నెల  19వ తేదీకి వాయిదా వేసింది. 


హైదరాబాద్: టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు  దాఖలు చేసిన బెయిల్ పిటిషన్  పై విచారణను  ఏపీ హైకోర్టు ఈ నెల  19వ తేదీకి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు.మంగళవారంనాడు  ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబుకు బెయిల్ కోరుతూ   ఆయన లాయర్లు  బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే  ఈ పిటిషన్ పై ఇవాళ విచారణ ప్రారంభం కాగానే  తమకు సమయం కావాలని చంద్రబాబు తరపు లాయర్లు  ఏపీ హైకోర్టును  కోరారు. దీంతో  ఈ పిటిషన్ పై విచారణను  ఏపీ హైకోర్టు వాయిదా వేసింది.

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను  ఏసీబీ కోర్టు కొట్టివేసింది.  దీంతో  ఏపీ హైకోర్టులో  చంద్రబాబు తరపు న్యాయవాదులు  ఈ నెల  12న  బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

Latest Videos

undefined

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో  చంద్రబాబు తరపు న్యాయవాదులు  ఈ ఏడాది సెప్టెంబర్  14న  ఏసీబీ కోర్టులో  బెయిల్ పిటిషన్ దాఖలు  చేశారు. ఈ పిటిషన్ పై ఇరు వర్గాల వాదనలను విన్న ఏసీబీ కోర్టు  ఈ నెల  9న చంద్రబాబు బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది. దీంతో  ఈ నెల  12న  చంద్రబాబు తరపు న్యాయవాదులు  ఏపీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.  ఈ నెల  12న  ఏపీ సీఐడీ తరపు న్యాయవాదులు  ఈ పిటిషన్ పై విచారణ సమయంలో సమయం కోరారు. దీంతో విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. అయితే  ఇవాళ చంద్రబాబు తరపు న్యాయవాదులు  ఏపీ హైకోర్టును సమయం కోరారు. దీంతో విచారణను ఈ నెల  19వ తేదీకి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు.

also read:ఏపీ హైకోర్టులో బాబుకు నిరాశ: స్కిల్ డెవలప్ మెంట్ కేసులో బెయిల్ పిటిషన్ విచారణ ఈ నెల 17కు వాయిదా

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్  కేసులో చంద్రబాబును ఏపీ సీఐడీ అధికారులు  ఈ ఏడాది సెప్టెంబర్ 9వ తేదీన అరెస్ట్ చేశారు.ఈ కేసులో చంద్రబాబు జ్యుడీషీయల్ రిమాండ్ లో ఉన్నారు.  

click me!