ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి హైకోర్టులో ఊరట: గుర్తింపు రద్దు షోకాజ్ పై స్టే

By narsimha lode  |  First Published Feb 15, 2023, 1:20 PM IST

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి  హైకోర్టులో  ఊరట లభించింది.  గుర్తింపు రద్దుపై  ప్రభుత్వం  ఇచ్చిన నోటీస్ పై  హైకోర్టు స్టే ఇచ్చింది. 


అమరావతి: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి  బుధవారంనాడు ఏపీ  హైకోర్టులో  ఊరట  దక్కింది.  జీతాల కోసం  ఏపీ గవర్నర్ ను కలిసిన  ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలకు షోకాజ్  నోటీసులు జారీ చేసింది  ఏపీ ప్రభుత్వం. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుర్తింపును  ఎందుకు  రద్దు  చేయకూడదో  చెప్పాలని ఆ షోకాజ్ నోటీసులో  ఏపీ ప్రభుత్వం  కోరింది.   ఈ షోకాజ్ నోటీసులపై  ఏపీ హైకోర్టు  ఇవాళ స్టే  ఇచ్చింది.  నిబంధనల ప్రకారంగా  నోటీసు ఇవ్వలేదని  హైకోర్టు అభిప్రాయపడింది.  ప్రాథమిక హక్కులకు భంగం కలిగేలా  నోటీస్  ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ విషయమై  కౌంటర్ దాఖలు  ప్రభుత్వాన్ని  ఆదేశించింది  హైకోర్టు.. విచారణను  మూడు వారాల పాటు  వాయిదా వేసింది  ఏపీ హైకోర్టు .

ఈ ఏడాది  జనవరి 19వ తేదీన  ఏపీ రాష్ట్ర ప్రభుత్వ  ఉద్యోగుల సంఘం నేతలు  రాష్ట్ర గవర్నర్ ను కలిశారు. వేతన బకాయిలతో పాటు  ఉద్యోగుల సమస్యపై  రాష్ట్ర గవర్నర్ ను కలిసి ఫిర్యాదు  చేశారు.  

Latest Videos

undefined

రాష్ట్ర ప్రభుత్వం తమకు  దీర్ఘకాలంగా  డీఏతో పాటు  ఇతర బకాయిలుు చెల్లించకుండా పెండింగ్ లో  ఉంచిందని  ప్రభుత్వ ఉద్యోగుల సంఘం  నేతలు   చెబుతున్నారు. ఈ విషయమై పలుమార్లు  ప్రభుత్వానికి  విన్నవించినా కూడా ఫలితం లేకపోవడంతో  గవర్నర్ ను కలవాల్సి వచ్చిందని ఉద్యోగ సంఘం నేతలు  ప్రకటించారు.  ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘం  నేతలు గవర్నర్ ను కలిసి  ఫిర్యాదు  చేయడాన్ని  ఇతర ఉద్యోగ సంఘాల నేతలు తప్పుబట్టారు.

గవర్నర్ ను  కలిసిన  ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలపై చర్యలు తీసుకోవాలని  కూడ  ప్రభుత్వానికి  ఇతర ఉద్యోగ సంఘాల నేతలు ఫిర్యాదు చేశారు.  ఈ ఫిర్యాదు ఆధారంగా  ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘం నేతలకు  ప్రభుత్వం  షోకాజ్ నోటీసు జారీ చేసింది.  ఈ షోకాజ్ నోటీసులపై  ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలు  హైకోర్టును ఆశ్రయించారు.

click me!