కడపలో స్టీల్ ప్లాంట్‌తో స్థానికులకు ఉపాధి: సీఎం జగన్

Published : Feb 15, 2023, 12:46 PM ISTUpdated : Feb 15, 2023, 01:50 PM IST
 కడపలో  స్టీల్  ప్లాంట్‌తో  స్థానికులకు  ఉపాధి: సీఎం జగన్

సారాంశం

కడప స్టీల్ ప్లాంట్  పరిశ్రమ ఏర్పాటుతో  స్థానికుల  కల  నెరవేరిందని మ ఏపీ సీఎం వైఎస్ జగన్  చెప్పారు.   ఈ పరిశ్రమతో  జిల్లా మరింత అభివృద్ది  చెందుతుందన్నారు.  

కడప: స్టీల్  ప్లాంట్  పరిశ్రమ  ఏర్పాటుతో  స్థానికులకు  పెద్ద సంఖ్యలో  ఉపాధి దక్కనుందని  ఏపీ సీఎం వైఎస్ జగన్  చెప్పారు. బుధవారంనాడు  కడప జిల్లాలోని  సున్నపురాళ్లపల్లె వద్ద  కడప స్టీల్ ఫ్యాక్టరీకి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు.  అనంతరం  నిర్వహించిన సభలో  సీఎం ప్రసంగించారు. 

ఎప్పటి నుండో  కలలు కన్న  స్వప్నం  స్టీల్ ప్లాంట్  అని  ఏపీ సీఎం వైఎస్ జగన్  చెప్పారు.  స్టీల్ ప్లాంట్  ఏర్పాటుతో  జిల్లా మరింత  అభివృద్ది  చెందుతుందన్నారు. 30 నెలల్లోపుగా  స్టీల్ ప్లాంట్  తొలి దశ పూర్తి  చేయనున్నట్టుగా  సీఎం  జగన్  తెలిపారు. రూ.  700 కోట్లతో  మౌళిక వసతులను అభివృద్ధి చేస్తున్నామని  సీఎం వివరించారు. రెండో విడతలో  మరో  20 లక్షల టన్నుల ఉత్పత్తి  సామర్ధ్యంతో  ప్లాంట్  విస్తరణ  చేయనున్నట్టుగా  సీఎం వైఎస్ జగన్  తెలిపారు.  స్టీల్ ప్లాంట్  ఏర్పాటుతో  చుట్టుపక్కల  అనుబంధ రంగాల అభివృద్ది  జరగనుందన్నారు. స్టీల్ ప్లాంట్  ఏర్పాటుతో  స్థానికంగా  ఉన్నవారికి  ఉపాధి దక్కనుందని  సీఎం జగన్   చెప్పారు.  రానున్న  24-30  నెలల్లోపుగా  స్టీల్ ప్లాంట్   తొలి విడత పనులు పూర్తవుతాయని  సీఎం జగన్  ప్రకటించారు.  

also read:కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం: భూమి పూజ చేసిన ఏపీ సీఎం వైఎస్ జగన్

ఈజ్ ఆఫ్ డూయింగ్  బిజినెస్  లో మూడేళ్లుగా  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం  నెంబర్ వన్ స్థానంలో  ఉన్న విషయాన్ని సీఎం జగన్  వివరించారు.  ఎలక్ట్రానిక్  మ్యాన్ ఫ్యాక్చరింగ్ క్లస్టర్ లో  వేల పరిశ్రమలు వస్తున్నాయని  సీఎం  జగన్  తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!