ఏపీఎస్ఆర్టీసీలో కారుణ్య నియామకాలు.. జగన్ సర్కార్‌కు హైకోర్టులో చుక్కెదురు, ఆ జీవోపై స్టే

By Siva Kodati  |  First Published Jan 2, 2022, 4:21 PM IST

ఏపీఎస్ఆర్టీసీ (apsrtc) కారుణ్య నియామకాల్లో (COMPASSIONATE APPOINTMENTs)  కోవిడ్ మృతులకు ప్రాధాన్యతను ఇవ్వడానికి సంబంధించి హైకోర్టులో ఆదివారం విచారణ జరిగింది. కారుణ్య నియామకాలకు సంబంధిం ప్రభుత్వం జారీ చేసిన జీవోపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.


ఏపీఎస్ఆర్టీసీ (apsrtc) కారుణ్య నియామకాల్లో (COMPASSIONATE APPOINTMENTs)  కోవిడ్ మృతులకు ప్రాధాన్యతను ఇవ్వడానికి సంబంధించి హైకోర్టులో ఆదివారం విచారణ జరిగింది. కారుణ్య నియామకాలకు సంబంధిం ప్రభుత్వం జారీ చేసిన జీవోపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 2016 నుంచి కారుణ్య నియామకాలు పెండింగ్‌లో వుంటే.. కోవిడ్‌తో చనిపోయిన ఉద్యోగులకు ప్రాధాన్యత ఇవ్వడం సరికాదని కొందరు పిటిషన్ దాఖలు చేశారు. సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. వరుస సంఖ్యను ఫాలో కావాలని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. 

Also Read:ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం: ఆ కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు

Latest Videos

కాగా.. కరోనాతో మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామాకాల కింద Government Jobs కల్పించాలని జగన్ ఈ ఏడాది అక్టోబర్‌లో ఆదేశించిన సంగతి తెలిసిందే. Andhra pradesh రాష్ట్రంలోCorona కారణంగా సుమారు 14,307 మంది మరణించారు. అయితే ఇందులో ఎంత మంది ప్రభుత్వ ఉద్యోగులున్నారో వారికి కారుణ్య నియామాకాల కింద ఉద్యోగాలు లభించనున్నాయి. గతేడాది నవంబర్ 30వ తేదీ నాటికి కారుణ్య నియామాకాల ప్రక్రియను పూర్తి చేయాలని జగన్ అప్పట్లో ఆదేశించారు.

click me!