
సీఎం జగన్ పత్తిపాడు పర్యటన అసత్యం, అబద్దాలకు కేరాఫ్ గా మారింది టీడీపీ నాయకుడు ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం ఆయన గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయం నుంచి మీడియాతో మాట్లాడారు. సీఎం గుంటూరు జిల్లా పర్యటనతో సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఆశించామని తెలిపారు. కోట్లు ఖర్చు పెట్ట ప్రభుత్వం అసత్య ప్రచారాలు చేస్తోందని ఆరోపించారు. కేవలం రూ. 250 పెన్షన్ పెంచి విపరీతంగా ప్రచారం చేసుకుంటాన్నారని విమర్శించారు.
ఉత్తరభారతంలో ఎముకలు కొరికే చలి.. వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు
ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే 50 లక్షల మందికి పెన్షన్ ఉందని తెలిపారు. గడిచిన రెండున్నరేళ్లలో వైసీపీ ప్రభుత్వం కేవలం 6 లక్షల మందికి మాత్రమే పెన్షన్ ఇచ్చిందని అన్నారు. అనాడు జగన్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో కొత్త పెన్షన్ పథకం తీసుకొస్తానని హామీ ఇచ్చారని, దానిని ఇప్పుడు మర్చిపోయారని ఆరోపించారు. 45 ఏళ్లు ఉన్న ప్రతీ మహిళకు పెన్షన్ ఇస్తామని చెప్పిన జగన్.. దానిని విస్మరించారని తెలిపారు. మోసం చేయడం అధికార వైసీపీకి అలవాటేనని ఆరోపించారు. తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒంటరి మహిళలకు కూడా పెన్షన్ ఇచ్చిందని గుర్తు చేశారు. కానీ వైసీపీ రాజకీయ కారణాలతో కావాలనే కొందరికి పెన్షన్‌లు నిలిపివేసిందని అన్నారు. ఈ మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో ఇసుక దోపిడి..
ఏపీలో ఇసుక దోపిడి జరుగుతుందని ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ ఆరోపించారు. వైసీపీ హయాంలో సిమెంట్ ధరలు పెరిగాయని అన్నారు. సినిమా టిక్కెట్ల విషయంలో పేద వారి వినోదం కోసం ఆలోచిస్తున్న జగన్ కు పెరిగిన ఇసుక, సిమెంట్ ధరలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఏపీలోనే పెట్రోల్ ధరలు అధికంగా ఉన్నాయని అన్నారు. ప్రతీ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గిస్తుంటే ఏపీ మాత్రం తగ్గించడం లేదని తెలిపారు. ప్రభుత్వాల లోపాలను ఎత్తి చూపడం ప్రతిపక్షంలో ఉన్న తమపై ఉందని అన్నారు. విమర్శలు చేస్తే అభివృద్ధికి అడ్డుపడటం ఎలా అవుతుందని తెలిపారు.పేద వారికి ఇళ్ల పట్టాల పంపిణీ విషయంలో ప్రభుత్వం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దోషులుగా తేలిన వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు.
డ్రంకెన్ డ్రైవ్... హైద్రాబాద్‌లో 2500 మందిపై కేసు
గుంటూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటిస్తున్నారని తెలియడంతో ఇక్కడి రైతుల సమస్యలు పరిష్కారమవుతాయని అనుకున్నామని.. కానీ అలా జరగలేదని అన్నారు. గుంటూరు జిల్లాలో 1 లక్ష 16వేల హెక్టార్లలో మిర్చి పంట వేశారని అన్నారు. అధిక వర్షాల వల్ల దాదాపు లక్ష ఎకరాల్లో మిర్చి పంట నష్టం జరిగిందని అన్నారు. ప్రస్తుత హోం మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో 23 వేల ఎకరాల మిర్చి పంటను పీకేశారని తెలిపారు.ఇంతలా పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఎందుకు ఆదుకోవడం లేదని ప్రశ్నించారు. తమ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో మిర్చి, మొక్కజొన్న ధరలు తగ్గిపోతే రైతులకు సాయం చేశామని అన్నారు. ఇప్పుడు ప్రభుత్వమే పంట కొంటోందని ప్రచారం చేసుకుంటుందని అన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం కేవలం 7 కోట్ల విలువ చేసే పంట మాత్రం కొనుగోలు చేసిందని ఆరోపించారు.