ఏపీ హైకోర్టులో ఏడుగురు న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం

Published : Feb 14, 2022, 12:00 PM IST
ఏపీ హైకోర్టులో ఏడుగురు న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో (AP High court) కొత్తగా నియమితులైన ఏడుగురు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకార కార్యక్రమం సోమవారం జరిగింది. హైకోర్టులోని మొదటి కోర్టు హాల్లో జరిగిన ఈ కార్యక్రమం జరిగింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు.   

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో (AP High court) కొత్తగా నియమితులైన ఏడుగురు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకార కార్యక్రమం సోమవారం జరిగింది. హైకోర్టులోని మొదటి కోర్టు హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో.. నూతన న్యాయమూర్తులుగా జస్టిస్ కొనకంటి శ్రీనివాస్ రెడ్డి, జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్, జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు నిమ్మగడ్డ, జస్టిస్ తర్లడ రాజశేఖర్ రావు, జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి, జస్టిస్ రవి చీమలపాటి, జస్టిస్ వడ్డిబోయన సుజాతలు ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. 

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో (andhra pradesh high court) ఏడుగురు జడ్జిల నియామకానికి రాష్ట్రపతి  రామ్‌నాథ్ కోవింద్ (ramnath kovind) ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. ఏపీ  హైకోర్టు న్యాయమూర్తులుగా గన్నమనేని రామకృష్ణ ప్రసాద్, నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, రాజశేఖర్ రావు, సత్తి సుబ్బారెడ్డి, చీమలపాటి రవి, వడ్డిబోయిన సుజాత, కొనగంటి శ్రీనివాస్ రెడ్డిలను సుప్రీంకోర్టు కొలీజియం ఇటీవల సిఫారసు చేసింది. సుప్రీంకోర్టు (supreme court) ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ (justice nv ramana) నేతృత్వంలోని కొలీజియం (supreme court collegium) ఈ మేరకు కేంద్రానికి ప్రతిపాదన చేసింది. జనవరి 29న జరిగిన కొలీజియం మీటింగ్‌లో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికి 

ఇక, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 37 మంది జడ్జిలు ఉండాల్సి ఉంది.  ప్రస్తుతం 20 మంది పనిచేస్తున్నారు. తాజా నియామకాలతో ఏపీ హైకోర్టులో జడ్జిల సంఖ్య 27కి పెరిగింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

CM Chandrababu Speech: తిరుపతి వెడ్డింగ్ హబ్ గా తయారవుతుంది | Wedding Hub | Asianet News Telugu
Chandrababu: స్వర్ణ నారావారిపల్లెకు శ్రీకారం చుట్టాం.. జీవనప్రమాణాలు పెంచాలి | Asianet News Telugu