ఇద్దరు పిల్లలను బావిలో తోసేసి తల్లి ఆత్మహత్యాయత్నం.. పిల్లలు మృతి..!

Published : Feb 14, 2022, 11:55 AM IST
ఇద్దరు పిల్లలను బావిలో తోసేసి తల్లి ఆత్మహత్యాయత్నం.. పిల్లలు మృతి..!

సారాంశం

విశాఖపట్నంలో విషాదం చోటు చేసుకుంది. ఓ తల్లి తన ఇద్దరు పిల్లలను బావిలో తోసేసి తానూ దూకింది. గమనించిన స్థానికులు రక్షించగా.. ఇద్దరు పిల్లలు అప్పటికే మృత్యువాత పడ్డారు.

విశాఖపట్నం : Visakhapatnamలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలను బావిలో తోసేసి.. తానూ దూకి ఓ mother ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఈ Suicide attempt ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. విశాఖ జిల్లా రోలుగుంట మండలం జె. నాయుడు పాలెంలో కుటుంబ కలహాల కారణంగా తల్లి తన ఇద్దరు పిల్లలు భాను (5), పృధ్వీ(3)లతో కలిసి బావిలో దూకింది. గమనించిన స్థానికులు బావిలోకి దూకి ముగ్గురిని వెలికితీశారు. అయితే అప్పటికే ఇద్దరు చిన్నారు మృతి చెందారు. తల్లి ప్రస్తుతం సురక్షితంగానే ఉంది. 

ఇదిలా ఉండగా,  కర్నాటక belagavi లో ఒక వ్యాపార కుటుంబానికి చెందిన మహిళ, ఇద్దరు పిల్లలతో చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకోగా.. భర్త, అత్తమామలను అరెస్ట్ చేసేంతవరకు అంత్యక్రియలు చేయబోమని మహిళ కుటుంబీకులు భీష్మించుకున్నారు. ఆదివారం బెలగావి బిమ్స్ ఆసుపత్రి మార్చురీ వద్ద మృతురాలి కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. ఆమె భర్త మనీష్, అతని కుటుంబమే ఆమెను హత్య చేశారని ఆరోపించారు.

వారందరినీ అరెస్టు చేసే వరకు మృతదేహాలను తీసుకునేది లేదంటూ ధర్నా నిర్వహించారు. దీంతో మూడు రోజుల నుంచి బిమ్స్ ఆసుపత్రి మార్చురీలోనే తల్లిపిల్లల మృతదేహాలు ఉన్నాయి. ఈ నెల 11వ తేదీన బెళగావి హిండలగా గణపతి ఆలయం చెరువులో క్రిషా కేశ్వానీ (36),  పిల్లలు వీరెన్ (7), బావీర్ (4) మృతదేహాలు తేలాయి. ఇది తెలిసిన వెంటనే భర్త మనీష్, కుటుంబ సభ్యులు పరారయ్యారు.  కాగా, ఆదివారం మనీష్ సోదరుడు మీడియాతో మాట్లాడుతూ త్రిషకు వేరొకరితో సంబంధం ఉందని అదే ఆత్మహత్యలకు కారణం అని అన్నాడు. 

ఇదిలా ఉండగా, ఫిబ్రవరి 7న Family strifeతో విసిగిపోయిన ఓ woman ముగ్గురు పిల్లలతో సహా jurala canalలోకి దూకిన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని wanaparthy జిల్లా pebberuలో చోటుచేసుకుంది. ఇందులో ఓ బాలుడిని స్థానిక యువకుడు రక్షించగా.. మిగతా ముగ్గురు మాత్రం గల్లంతయ్యారు. పెబ్బేరు ఎస్ఐ రామస్వామి,  స్థానికుల కథనం ప్రకారం... పెబ్బేరు పట్టణానికి చెందిన డిసిఎం డ్రైవర్ తెలుగు స్వామి, భవ్యలు పదేళ్ల కిందట ప్రేమించుకుని, కులాంతర వివాహం చేసుకున్నారు.

వీరికి అయిదేళ్ల జ్ఞానేశ్వరి, మూడేళ్ల వరుణ్, ఏడాది వయసున్న నిహారిక సంతానం. కొన్ని రోజులుగా కుటుంబ సమస్యలతో భార్యభర్తలు గొడవ పడుతున్నారు. ఆదివారం కూడా గొడవ జరగడంతో మనస్తాపానికి గురైన భవ్య.. ముగ్గురు పిల్లలను తీసుకుని రాత్రి ఏడున్నర గంటల సమయంలో పట్టణ సమీపంలో ఉన్న జూరాల ఎడమ ప్రధాన కాలువలోకి దూకింది. స్థానికులు గమనించి కేకలు వేయడంతో.. అటువైపు వెళుతున్న కుమార్ అనే యువకుడు మూడేళ్ల వరుణ్ ని కాపాడగలిగాడు.

తల్లి, ఇద్దరు కుమార్తెలు మాత్రం గల్లంతయ్యారు. విషయం తెలిసిన ఎస్ఐ సిబ్బందితో కలిసి ఘటనాస్థలికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. వెంటనే రామన్ పాడు జలాశయం అధికారులతో మాట్లాడి కాలువకు నీటి విడుదల నిలిపి వేయించారు. పూర్తి వివరాలు తెలుసుకుంటామని, ఉదయం గాలింపు చర్యలు చేపడతామని చెప్పారు. ఇప్పటివరకు తమకు ఎవరూ దీని మీద ఫిర్యాదు చేయలేదని అన్నారు. 

PREV
click me!

Recommended Stories

Success Story : అన్న క్యాంటీన్ నుండి పోలీస్ జాబ్ వరకు .. ఈమెది కదా సక్సెస్ అంటే..!
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ చిన్న‌ గ్రామం త్వరలోనే మరో సైబరాబాద్ కానుంది, అదృష్టం అంటే వీళ్లదే