
పెద్దతిప్పసముద్రం : three womenను మోసం చేసి పెళ్లి చేసుకున్న నిత్య పెళ్లి కొడుకు సహా నలుగురి మీద case నమోదు చేసినట్లు చిత్తూరు జిల్లా పెద్దతిప్పసముద్రం ఎస్ఐ మధురామచంద్రుడు తెలిపారు. పెద్దతిప్పసముద్రం మండలంలోని నవాబు కోటకు చెందిన TDP leader దండుపల్లె మంజునాథ్ (32) ఒకరికి తెలియకుండా మరొకరిని మోసం చేస్తూ మూడు Weddings చేసుకున్నాడు.
అతడి మోసాల గురించి తెలుసుకున్న వారిలో ఇద్దరు భార్యల ఆవేదన మీద ఆదివారం ఓ పత్రికలో.. ‘ఆ టీడీపీ నేత.. నిత్య పెళ్లికొడుకు’ శీర్షికన కథనం ప్రచురితమయ్యింది. దీనిమీద స్పందించిన కర్ణాటక రాస్ట్రం దావణగెరెకు చెందిన మూడో భార్య ఎస్.ప్రియాంక ఈ విషయం మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడు మంజునాథ్ తో పాటు మూడు పెళ్లిళ్లకు సహకరించిన అత్త, మామ, ఆడపడుచు అయిన వెంకట రమణ, వెంకట్రమణమ్మ, మమతపై కేసు నమోదు చేశారు.
ఐపీసీ 495, 498ఏ, 420, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నాట్లు ఎస్ఐ చెప్పారు. శనివారం రాత్రి 10 గంటల సమయంలో కర్ణాటక వాసులు ఆరుగురు వచ్చి నవాబుకోటలో మంజునాథ్ ఇంటి ఎదుట బైఠాయించి వాదులాటకు దిగారని తనకు ఫోన్ రావడంతో సిబ్బందితో వెళ్లి విచారించినట్లు తెలిపారు. తనకు జరిగిన అన్యాయం మీద మూడో భార్య ప్రియాంక ఆదివారం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశామన్నారు.
ఈ కేసులో మొదటి భార్యకు విడాకులు ఇచ్చినట్లు చెబుతున్నారని, ఈ విషయాన్ని కూడా విచారిస్తామని తెలిపారు. తనకు ఇంతకుముందే వివాహం జరిగిన విషయాన్ని దాచిపెట్టి, అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేసి, తన జీవితాన్ని నాశనం చేశాడని ఆరోపిస్తూ రెండో భార్య ఆశ ఈ నెల 11న కర్ణాటక చిక్ బళ్లాపురంలోని మహిళా పీఎస్ లో ఫిర్యాదు చేయగా అక్కడ కేసు నమోదయ్యిందని చెప్పారు.
ఇదిలా ఉండగా, నిరుడు నవంబర్ లో తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో నిత్య పెళ్లి కొడుకు బాగోతం వెలుగు చూసింది. మహిళలను బురిడీ కొట్టిస్తూ ఒకరి తరువాత ఒకరిని విలియమ్స్ అనే వ్యక్తి వివాహాలు చేసుకుంటూ వచ్చాడు. మొదటి భార్య తనూజ ఫిర్యాదుతో ఈ బాగోతం వెలుగు చూసింది. చర్చిలో పియానో వాయిస్తూ మహిళలను లోబరుచుకోవడం అతను అలవాటుగా చేసుకున్నాడు. అయితే అతని బాగోతం బయటపడడంతో గుండెపోటు వచ్చిందంటూ విలియమ్స్ ఆస్పత్రిలో చేరాడు.
అయితే ఆస్పత్రి నుంచి విలయమ్స్ ను నల్గొండ వన్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చర్చికి వచ్చే యువతులను మభ్యపెట్టి లోబరుచుకుంటూ వచ్చాడు. అంతేకాదు చాలామంది యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు కూడా తెలుస్తోంది. కాగా, అతనితో ఫొటోలు దిగినవారిలో చాలామంది అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందినవారే ఉన్నారు. ఓ మంత్రి కూడా అందులో ఉన్నారు.
విలియమ్స్ వలలో మరింత మంది మహిళలు పడి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. తనూజ ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీంతో మరింతమంది విలియమ్స్ బాధితులు బయటకు రావచ్చని భావించారు.