నిమ్మగడ్డ పిటిషన్: జగన్ సర్కార్‌పై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Published : Nov 03, 2020, 11:59 AM ISTUpdated : Nov 03, 2020, 12:11 PM IST
నిమ్మగడ్డ పిటిషన్:   జగన్ సర్కార్‌పై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

సారాంశం

ఏపీ ప్రభుత్వంపై ఏపీ హైకోర్టు మంగళవారం నాడు కీలక వ్యాఖ్యలు చేసింది. 

అమరావతి:ఏపీ ప్రభుత్వంపై ఏపీ హైకోర్టు మంగళవారం నాడు కీలక వ్యాఖ్యలు చేసింది. 

 

రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు తీర్పు వెల్లడించింది.రాష్ట్ర ఎన్నికల సంఘం వినతుపై రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని కోర్టు అభిప్రాయపడింది. 

 

also read:స్థానిక ఎన్నికలపై నిమ్మగడ్డ పిటిషన్: జగన్ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశం
తాము తొలగించిన వ్యక్తి రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా నియమించడంతోనే ప్రభుత్వం నాన్ కో ఆపరేటివ్గా వ్యవహరిస్తోందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

ప్రభుత్వాలు మారుతాయి, రాజ్యాంగ సంస్థలు ఎప్పుడూ ఉంటాయని కోర్టు ఈ సందర్భంగా గుర్తు చేసింది.రాజ్యాంగ సంస్థలను కాపాడుకోకపోతే ప్రజాస్వామ్యం కుప్పకూలే ప్రమాదం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది.

also read:ఈసీకి నిధులు ఆపేసిన ప్రభుత్వం... రమేశ్ పిటిషన్: తీర్పు రిజర్వ్

ప్రభుత్వానికి మూడు రోజుల్లో ఈసీ పూర్తి వివరాలతో వినతిపత్రం సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.ప్రభుత్వం నివేదిక రూపంలో 15 రోజుల్లోగా నివేదికను తమకు అందించాలని హైకోర్టు ఆదేశించింది.

రాష్ట్ర ప్రభుత్వం తమకు నిధులను సక్రమంగా ఇవ్వడం లేదని ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అక్టోబర్ 21వ తేదీన పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన  హైకోర్టు ఇవాళ తీర్పును వెల్లడించింది.

 రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 (కె) ప్రకారంగా ఎన్నికల కమిషన్ కు నిధులు నిలిపివేయడం చట్టవిరుద్దమని ఆ పిటిషన్ లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోరిన విషయం తెలిసిందే.


 


 

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు