ఎంపీటీసీ, జడ్‌పీటీసీ ఎన్నికలను సవాల్ చేస్తూ పిటిషన్: విచారణ మంగళవారానికి వాయిదా

Siva Kodati |  
Published : Apr 04, 2021, 04:29 PM IST
ఎంపీటీసీ, జడ్‌పీటీసీ ఎన్నికలను సవాల్ చేస్తూ పిటిషన్: విచారణ మంగళవారానికి వాయిదా

సారాంశం

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై ఆదివారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా అనుబంధ పిటిషన్‌లపై తీర్పు రిజర్వ్ చేసింది న్యాయస్థానం. ఎంపీటీసీ, జడ్‌పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై ఆదివారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా అనుబంధ పిటిషన్‌లపై తీర్పు రిజర్వ్ చేసింది న్యాయస్థానం. ఎంపీటీసీ, జడ్‌పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి.

దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఎస్ఈసీ, ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అనంతరం జనసేన పిటిషన్‌పై విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. అంతకుముందు విచారణ సందర్భంగా ఎన్నికల ప్రక్రియ ఆగినచోటు నుంచే కొనసాగిస్తున్నట్లు ఎస్ఈసీ వివరణ ఇచ్చింది.

పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ మాత్రమే మిగిలి ఉందన్న ఎస్ఈసీ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఎన్నికలకు ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారని ఆయన తెలియజేశారు. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Naidu: జిల్లా కలెక్టర్లకు సీఎం కీలక ఆదేశాలు| Asianet News Telugu
CM Chandrababu: నిధులు లేవని ప్రాజెక్ట్స్ నిలపకండి అధికారులకు సీఎం ఆదేశాలు | Asianet News Telugu