ఏపీలో స్థానిక సంస్థలు: ఉద్యోగులకు షాకిచ్చిన హైకోర్టు

By narsimha lode  |  First Published Jan 19, 2021, 12:37 PM IST

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను రద్దు చేయాలని కోరుతూ ఉద్యోగుల ఫెడరేషన్ దాఖలు చేసిన పిటిషన్ ను  ఏపీ హైకోర్టు మంగళవారం నాడు కొట్టేసింది.


విజయవాడ: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను రద్దు చేయాలని కోరుతూ ఉద్యోగుల ఫెడరేషన్ దాఖలు చేసిన పిటిషన్ ను  ఏపీ హైకోర్టు మంగళవారం నాడు కొట్టేసింది.ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను రద్దు చేయాలని ఉద్యోగుల ఫెడరేషన్ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్  ను హైకోర్టు కొట్టేసింది. 

also read:కరోనా వ్యాక్సినేషన్ ఉన్నందున ఎన్నికల వాయిదాకు లేఖ రాశాం: హైకోర్టులో ఎస్ఈసీపై ఏజీ

Latest Videos

మరో వైపు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ పై హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టు ధర్మాసనంలో ఏపీ ఎస్ఈసీ పిటిషన్ దాఖలు చేసింది.ఈ పిటిషన్ పై సోమవారం నాడు కూడ విచారణ జరిగింది. సోమవారం నాడు ఈ పిటిషన్ పై విచారణ సాగింది. మంగళవారం నాడు కూడ ఈ పిటిషన్ పై ఇరువర్గాల వాదనలు సాగాయి.

ఏపీలో ఈ ేడాది ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ను ఏపీ ఎస్ఈసీ జారీ చేసింది. ఈ షెడ్యూల్ ను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.ఎన్నికల షెడ్యూల్ ను సస్పెండ్ చేస్తూ ఈ నెల 11న ఏపీ హైకోర్టు ఆదేశించింది.ఈ ఆదేశాలపై ఎస్ఈసీ ఏపీ హైకోర్టు ధర్మాసనంలో పిటిషన్ దాఖలు చేసింది.
 

click me!