రాత్రి నుండి పదిసార్లు ఫోన్ చేశా, ఫోన్ ఎత్తలేదు: దేవినేనిపై కొడాలి మరోసారి ఫైర్

Published : Jan 19, 2021, 11:20 AM IST
రాత్రి నుండి పదిసార్లు ఫోన్ చేశా, ఫోన్ ఎత్తలేదు: దేవినేనిపై కొడాలి మరోసారి ఫైర్

సారాంశం

: రాష్ట్రంలో అత్యంత చవటల్లో దేవినేని ఉమా నెంబర్ వన్ అని  ఏపీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు.


విజయవాడ: రాష్ట్రంలో అత్యంత చవటల్లో దేవినేని ఉమా నెంబర్ వన్ అని  ఏపీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు.మంగళవారం నాడు విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. దేవినేని ఉమా మహేశ్వరరావుకు దమ్ముంటే ఏ  ఛానెల్‌లోనైనా చర్చకు రావాలని కోరారు.

also read:గొల్లపూ'ఢీ': రంగంలోకి వల్లభనేని వంశీ, ఉద్రిక్తత

రాత్రి నుండి దేవినేని ఉమకు పదిసార్లు ఫోన్ చేశానని ఆయన గుర్తు చేశారు. తన ఫోన్ కు ఆయన స్పందించలేదన్నారు. మీడియా ముందు కూడా తాను ఉమకు ఫోన్ చేసినట్టుగా ఆయన చెప్పారు.తమ ప్రభుత్వం ప్రజల కోసం ఏ కార్యక్రమాలు చేసిందో గత ప్రభుత్వం ఏ కార్యక్రమాలు చేసిందో చర్చకు సిద్దమని ఆయన మరోసారి దేవినేని ఉమకు సవాల్ విసిరారు. ఎక్కడకు రావాలో చెప్పాలని తాను ఫోన్ చేస్తే ఉమ స్పందించలేదన్నారు. కానీ ఇవేం కోడి పందెలా అని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

తనకు బడితపూజ చేస్తానని ఏపీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలకు నిరసనగా గొల్లపూడి ఎన్టీఆర్ విగ్రహాం వద్ద దీక్ష చేస్తానని ఏపీ మాజీ మంత్రి దేవినేని ఉమ ప్రకటించారు. ఇవాళ ఎన్టీఆర్ విగ్రహం వద్ద దీక్ష చేయడానికి ఉమా ప్రయత్నించడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. 

 

PREV
click me!

Recommended Stories

Gorantla Butchaiah Chowdary: బుచ్చయ్య చౌదరి పంచ్ లకి పడిపడి నవ్విన చంద్రబాబు| Asianet News Telugu
Monsoon Update : బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లోకి రుతుపవనాలు.. తెలుగు రాష్ట్రాలను తాకేదెన్నడో తెలుసా..?